లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) లుక్ ఎలా ఉంది? 96 సెకన్లు నిడివి గల 'ఆదిపురుష్' టీజర్ (Adipurush Teaser) విడుదలైన తర్వాత, అందులో ఆయన కనిపించిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విమర్శలకు అయితే లెక్క లేదు. విజువల్స్ మీద ట్రోల్స్, మీమ్స్ సంగతి సరే సరి! కార్టూన్ ఫిల్మ్ అని కామెంట్స్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే...


రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇందులో శ్రీరాముని పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించారు. ఆయన సరసన సీతా దేవిగా కృతి సనన్ (Kriti Sanon) కనిపించనున్నారు. సీతా రాములను, రావణుడితో పాటు హనుమంతుడిని చూపించిన విధానం సరి కాదని చాలా మంది మండిపడుతున్నారు. కొందరు అయితే సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు కూడా! ఈ నేపథ్యంలో విమర్శలపై చిత్ర దర్శకుడు ఓం రౌత్ (Om Raut) స్పందించారు. తానూ, తన బృందం ఏ తప్పూ చేయలేదని ఆయన తెలిపారు. 


రావణుడిగా సైఫ్ అలీ ఖాన్...
'పద్మావత్'లో ఖిల్జీలా ఉన్నాడేంటి?
'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత అందులో సైఫ్ అలీ ఖాన్ లుక్ మీద చాలా విమర్శలు వచ్చాయి. 'పద్మావత్' సినిమాలో ర‌ణ్‌వీర్ సింగ్ నటించిన ఖిల్జీలా ఉందని కామెంట్స్ చేశారు. వాటిపై ఓం రౌత్ మాట్లాడుతూ ''ఇంతకు ముందు సినిమాల్లో రావణుడిని, రావణుడిలో రాక్షస గుణాలను కళాత్మకంగా చూపించారు. నా రావణుడూ దుష్టుడి, రాక్షసుడే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధంగా రావణుడిని నేను చూపించాను. నా రావణుడు ఇంతే! అతడి రంగు మార్చనని చెబితే నేను ఒప్పుకోను'' అని అన్నారు.
 
అది పుష్పక విమానం కాదు!
'ఆదిపురుష్' టీజర్‌లో సైఫ్ అలీ ఖాన్ ఒక విధమైన జీవి మీద కనిపించారు. సీతా దేవిని అపహరించడానికి పుష్పక విమానం మీద రావణుడు వచ్చాడని చెబుతారు. ఓం రౌత్ పుష్పక విమానాన్ని సైతం మార్చేశారని కొందరు కామెంట్ చేస్తున్నారు. దీనికి ఆయన బదులిస్తూ ''అది పుష్పక విమానమని ఎవరు చెప్పారు? మా సినిమాలో 95 సెకన్లను మాత్రమే చూపించాం. జనవరిలో సినిమా చూడండి. మేం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయం'' అని అన్నారు. 


Also Read : Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజ‌ర్‌నూ


నవతరం ప్రేక్షకులకు, యువతకు రామాయణం చేరువ కావాలంటే... రాముడి వ్యక్తిత్వం, ఆయన అవతార స్ఫూర్తి గురించి తెలియాలంటే... ఈ విధంగా చెప్పక తప్పదని ఓం రౌత్ వివరించారు. ప్రజలు కొన్ని విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఈ సినిమాతో ప్రపంచానికి రాముడి కథను పరిచయం చేయాలనుకుంటున్నామని ఓం రౌత్ పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం.


Also Read : Om Raut on Adipurush Trolls : మొబైల్స్‌లో చూస్తే? - 'ఆదిపురుష్' టీజర్ ట్రోల్స్, మీమ్స్‌పై దర్శకుడు ఓం రౌత్ రియాక్షన్