తాలిబన్- ఇస్లామిక్ స్టేట్ మధ్య శత్రుత్వం కొత్తేమీ కాదు. అమెరికా దళాలు వెనుదిరగక ముందు నుంచే వీరి మధ్య శత్రుత్వం ఉంది. రెండు వర్గాలు కఠిన ఇస్లాం నిబంధనలు పాటిస్తాయి. కానీ వీరి సిద్ధాంతాల్లో కొంత వ్యత్యాసం ఉంది. అఫ్గానిస్థాన్‌పై పట్టు కోసం తాలిబన్లు ఇన్నేళ్లు శ్రమించగా.. అంతర్జాతీయంగా 'జిహాద్' కోసం ఐఎస్ పిలుపునిచ్చింది.
అమెరికా, నాటో దళాలు వెనుదిరగక ముందే.. మెరుపు వేగంతో కాబుల్‌ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. దేశాన్ని వీడేందుకు ప్రజలు ప్రయత్నిస్తోన్న సమయంలో కాబూల్ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడింది ఐసిస్-కే. ఈ ఘటనలో అమాయక ప్రజలు, తాలిబన్ ఫైటర్లు, అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిణామాలతో.. అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, భద్రత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో వాటిని మరింత పెంచే విధంగా తాలిబన్ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది ఇస్లామిక్ స్టేట్.
Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'
Also Read: UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం