Toyota Innova Crysta Launched In India: ఇండియాలో ఫ్యామిలీ కార్ గా ఎంతో సక్సెస్ సాధించిన టయోటా ఇన్నోవా క్రిస్టా సరికొత్త మార్పులతో మార్కెట్ లోకి వచ్చింది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు ఈ ఎమ్‌పీవీ (MPV) లో కొన్ని కాస్మెటిక్ డిజైన్ చేంజెస్ తో పాటు కొత్త కంఫర్ట్ ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. రెండు దశాబ్దాలుగా దేశంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్ గా ఉన్న ఈ కార్ ను మరింత ప్రీమియం లుక్ లోకి మార్చారు. నమ్మకమైన డీజిల్ పవర్‌ట్రెయిన్ తో నడిచే ఈ కొత్త వెర్షన్ ప్రాక్టికల్ ఫ్యామిలీ వెహికల్ కోరుకునే బైయర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.

Continues below advertisement

Read Also: First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ

బోల్డర్ లుక్ లో ఫ్రంట్ గ్రిల్.. 

Continues below advertisement

ఈ 2026 టయోటా ఇన్నోవా క్రిస్టా ఓవరాల్ సిల్హౌట్ పాత మోడల్ లాగే ఉన్నప్పటికీ దీని లుక్ ను మరింత మోడ్రన్ గా మార్చడానికి కొన్ని మార్పులు చేశారు. ఫ్రంట్ సైడ్ రీడిజైన్ చేసిన సరికొత్త బోల్డర్ ఫ్రంట్ గ్రిల్ ను అమర్చారు. దీనితో పాటు కార్ కు రోడ్ ప్రెజెన్స్ ను పెంచేలా ఫ్రంట్, రియర్ బంపర్ గార్నిష్ లను రివైజ్ చేశారు. ఈ కాస్మెటిక్ అప్‌డేట్స్ వల్ల కారుకు మరింత మస్కులర్, సోఫిస్టికేటెడ్ అప్పీయరెన్స్ లభిస్తోంది. ప్రీమియం స్టైల్ తో పాటు ప్రాక్టికాలిటీని ఇష్టపడే కస్టమర్లను టార్గెట్ చేస్తూ దీనిని డిజైన్ చేశారు.

Read Also: Top Automatic Cars Under 6 Lakhs: 6 లక్షల బడ్జెట్ లో టాప్ ఆటోమేటిక్ కార్లు: సిటీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ ఇక చాలా ఈజీ.. బెస్ట్ మైలేజ్, మోస్ట్ ఎఫోర్డబుల్

లగ్జరీ క్యాబిన్ ఎక్స్ పీరియన్స్..

క్యాబిన్ లోపల ఎక్స్ పీరియన్స్ ను ఇంప్రూవ్ చేయడానికి టొయోటా చాలా అప్‌డేట్స్ ఇచ్చింది. ఇందులో కొత్త గ్రేస్ కాపర్ ట్రిమ్ యాక్సెంట్స్ తో పాటు డ్యాష్ బోర్డ్, డోర్ ప్యానెల్స్ పై ఉడెన్ ప్యాటర్న్ ఇన్సర్ట్స్ ఇచ్చారు. సీట్ల కోసం డ్యూయల్ టోన్ లెదర్ అప్‌హోల్‌స్టరీని ఉపయోగించారు. కొన్ని సెలెక్టెడ్ వేరియంట్లలో వైర్ లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) లాంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్.. 

ఈ కొత్త ఇన్నోవా క్రిస్టా లో నమ్మకమైన 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్ ను కంటిన్యూ చేశారు. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో వస్తూ 148 బీహెచ్‌పీ పవర్, 343 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. లీటరుకు 15 కిమీ వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. స్మూత్ పర్ఫార్మెన్స్ వల్ల ప్రైవేట్, కమర్షియల్ బైయర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్ గా మారింది. ధరల విషయానికి వస్తే 7 సీటర్ జిఎక్స్ (GX) వేరియంట్ రూ. 19.72 లక్షలు, జిఎక్స్ ప్లస్ రూ. 21.15 లక్షలు, విఎక్స్ రూ. 24.93 లక్షలుగా ఉన్నాయి. టాప్ ఎండ్ జెడ్ ఎక్స్ (ZX) 7 సీటర్ వేరియంట్ ధర రూ. 26.63 లక్షలుగా ఫిక్స్ చేశారు. 8 సీటర్ ఆప్షన్లు రూ. 5,000 అదనపు ధరతో లభిస్తున్నాయి.