Top Affordable Automatic Cars Under 6 Lakhs: ఇండియాలో ఆటోమేటిక్ కార్ల వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. సిటీల్లో హెవీ ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ అవ్వడం వల్ల గేర్లు మార్చే ఇబ్బంది లేకుండా డ్రైవ్ చేయడానికి జనాలు ఇప్పుడు ఆటోమేటిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు కేవలం కాస్ట్ లీ కార్లకే పరిమితమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా వచ్చేసింది. ముఖ్యంగా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) టెక్నాలజీ వల్ల కంపెనీలు తక్కువ ధరలోనే ఆటోమేటిక్ వేరియంట్లను మార్కెట్ లోకి తెస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రూ. 6 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో దొరికే బెస్ట్ ఆటోమేటిక్ కార్ల వివరాలు చూద్దాం.

Continues below advertisement

Read Also: కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే

మారుతి ఎస్ ప్రెస్సో, ఆల్టో కే10

Continues below advertisement

ఈ లిస్టులో ఫస్ట్ కార్ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. దీని ఎఎమ్‌టి గేర్‌బాక్స్ విఎక్స్‌ఐ (ఓ), విఎక్స్‌ఐ ప్లస్ (ఓ) ట్రిమ్స్ లో వస్తోంది. వీటి ధరలు రూ. 4.8 లక్షలు, రూ. 5.3 లక్షలుగా ఉన్నాయి. ఇది 1.0 లీటర్ ఇంజిన్ తో 25.3 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీని తర్వాత మారుతి ఆల్టో కే10 నిలిచింది. దీని ఎఎమ్‌టి వేరియంట్లు రూ. 4.95 లక్షలు, రూ. 5.45 లక్షల ధరల్లో లభిస్తున్నాయి. ఇది లీటరుకు 24.9 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Read Also: Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే

రొనాల్డ్ క్విడ్ మోడ్రన్ లుక్.. 

ఫ్రెంచ్ కార్ మేకర్ రొనాల్డ్ నుంచి వచ్చిన క్విడ్ ఎఎమ్‌టి ధర రూ. 5 లక్షల నుంచి రూ. 5.9 లక్షల మధ్య ఉంది. ఇందులో సాంప్రదాయ గేర్ లివర్ కి బదులుగా రోటరీ గేర్ సెలెక్టర్ నాబ్ ఇచ్చారు. 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, టీపీఎమ్ఎస్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక బెస్ట్ మైలేజ్ కార్ గా పేరు తెచ్చుకున్న మారుతి సెలెరియో ఎఎమ్‌టి వేరియంట్ల ధర రూ. 5.6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఏకంగా లీటరుకు 26.68 కిమీ మైలేజ్ ఇస్తూ టాప్ లో ఉంది. ఇందులో పుష్ బటన్ స్టార్ట్, అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు దక్కుతాయి.

ఎక్కువ మంది చదివిన వార్తలను అసలు మిస్ కావద్దు 

1'పెద్ది' ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా రామ్ చరణ్ సినిమాలో సీన్ టు సీన్ - లైవ్ అప్డేట్స్
2పెద్ది ట్విట్టర్ రివ్యూ... రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్?
 3పెద్దిపై టాలీవుడ్ స్టార్స్ ఫస్ట్ రివ్యూస్...
4దేశవ్యాప్తంగా పెద్ది ఫెస్టివల్ - మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ వేరే లెవల్... ఇవి వెరీ స్పెషల్
5పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్

మారుతి వ్యాగన్ ఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్.. 

ఫ్యామిలీ కార్ గా పాపులర్ అయిన మారుతి వ్యాగన్ ఆర్ ఎఎమ్‌టి ఆప్షన్ 1.0 లీటర్, 1.2 లీటర్ ఇంజిన్లలో వస్తోంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 6.95 లక్షల వరకు ఉంది. ఇక చివరగా రీసెంట్ గా లాంచ్ అయిన కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ఎఎమ్‌టి బేస్ ప్రైస్ రూ. 6 లక్షలుగా ఉంది. ఇది 1.2 లీటర్ ఇంజిన్ తో వస్తుంది. ఇందులో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది పెట్రోల్ తో పాటు సిఎన్జీ (CNG) కాంబినేషన్ లో కూడా ఎఎమ్‌టి గేర్‌బాక్స్ ఆఫర్ చేస్తోంది. ఇండియాలో ఆటోమేటిక్ ఆప్షన్ తో వస్తున్న ఏకైక సిఎన్జీ హ్యాచ్‌బ్యాక్ కార్ ఇదే కావడం విశేషం.