మీరు కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా.. అయితే మీకు ఓ గుడ్ న్యూస్. టాటా మోటార్స్ (Tata Motors) తన పాపులర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ఈవీ (Tiago EV) ఫేస్‌లిఫ్ట్ మోడల్ బుకింగ్స్‌ ప్రారంభించింది. కంపెనీ ఈ కారును సరికొత్త లుక్, మోడరన్ ఫీచర్స్, మెరుగైన సాంకేతికతతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. టియాగో ఈవీ ఇప్పటికే భారత్‌లో అత్యంత ఆదరణ పొందిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ప్రస్తుతం ఈ కొత్త అప్‌డేట్‌ల తర్వాత టియాగో ఈవీ కస్టమర్లను మరింతగా ఆకర్షించనుంది. మీరు ఈ వాహనాన్ని కేవలం రూ. 11 వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.

Continues below advertisement

 మారిన కారు లుక్, డిజైన్కొత్త టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Tiago EV Facelift) ముందు భాగాన్ని గతంలో కంటే మరింత స్టైలిష్‌గా మార్చారు. కొత్త డిజైన్‌తో కూడిన గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్, షార్ప్ లుక్ ఉన్న లైట్లు ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇవి కాకుండా, కొత్త డిజైన్ వీల్స్, కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేశారు. ఈ మార్పుల తరువాత రోడ్డుపై టియాగో ఈవీ కారు గతంలో కంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కారు కేబిన్‌ను మునుపటి కంటే మోడ్రన్‌గా, కంఫర్ట‌బుల్‌గా తయారు చేశారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు.  దీనివల్ల పాటలు వినడం, నావిగేషన్ ఉపయోగించడం, స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయడం చాలా సులభం కానుంది. దీనితో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పలు స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు కూడా యాడ్ చేశారు. ఈ ఫీచర్ల వల్ల కారణంగా డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ గతంలో కంటే ఎంతో మెరుగ్గా అనిపిస్తుంది. 

Continues below advertisement

Read Also: Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే

కారు సేఫ్టీ ఎలా ఉంది?

కొత్త టియాగో ఈవీలో ప్రయాణికుల సేప్టీ మెరుగుపరిచేలా పలు అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లను ఇచ్చారు. ఇందులో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఇతర అవసరమైన సేఫ్టీ సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఈ కారు ఫ్యామిలీ జర్నీకి కూడా ఒక మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు. 

బ్యాటరీ, రేంజ్ విషయానికి వస్తే, కంపెనీ దీని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను గతంలోలాగే ఉంచింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, ఈ కారు సిటీ రోడ్లపై మీ రోజువారీ ప్రయాణానికి సరిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ సహాయంతో బ్యాటరీని చాలా తక్కువ సమయంలోనే ఛార్జింగ్ కూడా చేయవచ్చు. దీనివల్ల లాంగ్ జర్నీ సమయంలో కూడా అంతగా ఇబ్బంది ఉండదు.

Read Also: Honda Activa 7G vs TVS Jupiter: హోండా యాక్టివా 7G vs టీవీఎస్‌ జుపిటర్! ఫీచర్లు, ధర, పనితీరు మధ్య వ్యత్యాసాలు!

టాటా టియాగో బుకింగ్ ప్రక్రియను కూడా ఈజీ చేశారు. కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ https://ev.tatamotors.com/tiago/ev.html ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటు తమకు దగ్గరలోని టాటా డీలర్‌షిప్‌ను కలిసి కూడా కారును బుక్ చేసుకోవచ్చు. కారు బుకింగ్ పూర్తయిన తర్వాత, కంపెనీ కస్టమర్లకు డెలివరీ, కారు అందుబాటుకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు.