Honda Activa 7G vs TVS Jupiter: భారతీయ టూ వీలర్  మార్కెట్‌ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అయితే మధ్యతరగతి మాత్రం ఎక్కువ మైలేజ్, సరసమైన ధరకే ప్రయార్టీ ఇస్తారు. అలాంటి వాహనాలే పోటీలో ఉంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి హోండా యాక్టివా 7G, టీవీఎస్ జుపిటర్. 110cc సెగ్మెంట్‌లో ఈ రెండు నిత్యం పోటీ పడుతున్నాయి.  అందుకే హోండా యాక్టివా 7G, టీవీఎస్‌ జుపిటర్ మధ్య ఏది బెస్ట్ అనే చర్చ మళ్లీ మొదలైంది. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌, టెక్నాలజీ ప్రాధాన్యతలను బట్టి ఈ రెండింటిలో ఏది మీ ఇంటికి సరైందో చూడండి. 

Continues below advertisement

ధరలో ఎవరు ముందంజలో ఉన్నారు?

ఏ వాహనం కొనాలన్నా సామాన్యుడు ముందుగా చూసేది ధర. హైదరాబాద్‌ ఎక్స్‌షోరూమ్‌ ధరల ప్రకారం టీవీఎస్ జుపిటర్ ప్రారంభ ధర 76,550 రూపాయలు. హోండా యాక్టివా 7G ప్రారంభ ధర 79000వేల రూపాయలు. అంటే ధర పరంగా చూస్తే యాక్టివా కంటే జుపిటర్ సుమారు ఐదు వేల రూపాయల తక్కువకు వస్తుంది. 

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ వార్తలు మిస్ అవ్వొద్దు

1Ola, Uberలను టెన్షన్ పెడుతున్న VinFast.!
2టాటా టియాగో ఈవీ కొనేందుకు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ?
3పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx!
4Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి..
5ట్రయంఫ్ బైకుల ధరలు భారీగా పెంపు

అయితే, ఆన్‌రోడ్‌ ధరల విషయానికి వస్తే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకు టీవీఎస్‌ జుపిటర్‌ డ్రమ్ వేరియంట్‌ ఆన్‌ రోడ్‌ ధర 91,738 రూపాయలు. అదే హోండా యాక్టివా 7G ఆన‌రోడ్‌ ప్రైస్‌ 79వేల రూపాయలు. ఇది బేసిక్ మోడల్ ఇందులోనే హెచ్‌ స్మార్ట్ టెక్నాలజీ వేరియంట్‌ ధర చాలా ఎక్కువ ఉంటుంది. 

Continues below advertisement

ఇంజిన్ సామర్థ్యం

స్కూటర్‌ పనితీరు దాని ఇంజిన్‌పై ఆధారపడి ఉంటుంది. టీవీఎస్‌ జుపిటర్ 113.3cc సింగిల్‌ సిలిండర్‌, 4 స్ట్రోక్‌, సీవీటీఐ, ఫ్యూయల్‌ ఇంజెక్షన్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది 8.02 పీఎస్ పవర్‌ను 6500rpm వద్ద, 9.2Nm టార్క్‌ను 5500rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. 

హోండా యాక్టివా విషయానికి వస్తే, ఇది ఎప్పుడూ తన ఇంజిన్‌ సున్నితత్వం, విశ్వసనీయతకు మారుపేరుగా చెలామణి అవుతోంది. హోండా ఇంజిన్ ఐదేళ్ల తర్వాత కూడా అదే పనితీరు ఇస్తుందని వినియోగదారులు చెబుతున్నారు. జుపిటర్ కూడా తన తక్కువ శబ్దంతో కూడిన సున్నితమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గుంతల రోడ్లపై సస్పెన్షన్ మెరుగ్గా ఉంటుందని టాక్. 

మైలేజీలో ఎవరు సూపర్?

మైలేజీ విషయంలో టీవీఎస్‌ జుపిట్ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. కంపెనీ క్లెయిమ్‌ ప్రకారం ఇది లీటర్‌కు 48 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కొంతమంది వినియోగదారులు సిటీలో 55కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుందని చెబుతుండగా, మరికొందరు 33-45కిలోమీటర్ల మధ్య వస్తుందని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. హోండాయాక్టివా దాదాపు ఇదే స్థాయిలో మైలేజీని ఇస్తుంది. అయితే మెయింటెనెన్స్‌ సరిగా ఉంటే హోండా వాహనాలు దీర్ఘకాలంలో స్థిరమైన మైలేజీ అందిస్తాయి. 

ఫీచర్స్‌లో ఎవరు బెస్ట్?

నేటి తరం వాహనాల్లో ఫీచర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విషయంలో రెండు కంపెనీలు పోటాపోటీగా ఉన్నాయి. టీవీఎస్ జుపిటర్‌లో 33 లీటర్ల భారీ అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. ఇందులో రెండు ఫుల్ సైజ్ హెల్మెంట్‌లను ఉంచవచ్చు. అలాగే మొబైల్‌ ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్‌ స్పీడో మీట్ ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్ ఫిల్లింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అదే హోండా యాక్టివా 7G తన కొత్త మోడల్‌లో హెచ్‌ స్మార్ట్ కీ ఫీచర్‌ కలిగి ఉంది. ఇది కీ లేకుండానే స్కూటర్ స్టార్ట్ చేయటానికి, లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, ఇందులో సరికొత్త టీఎఫ్‌టీ డిస్‌ప్లే, టర్న్‌బై టర్న్ నావిగేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

జుపిటర్‌లో లభించే బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ రైడ్‌కు మెరుగైన స్థిరత్వాన్ని ఇస్తుంది. అదే సమయంలో యాక్టివాలోని సింక్రోనైజ్డ్‌ బ్రేకింగ్ సిస్టమ్‌ భద్రకు భరోసా ఇస్తుంది. 

ఎవరికి ఏది సరిపోతుంది?

మీకు రీసేల్ వాల్యూ, ఇంజిన్ విశ్వసనీయత ముఖ్యం అయితే హోండా యాక్టివా ఎంచుకోవచ్చు. ఒక వేళ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ స్టోరేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ కావాలనుకుంటే టీవీఎస్ జుపిటర్ సరైన ఎంపిక.