Best Electric Scooter: భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గత మూడేళ్లుగా ఓ మోస్తరుగా ఈవీల విక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరగడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా ప్రజలు ఈవీ స్కూటర్ల (EV Scooters) వైపు వేగంగా షిఫ్ట్ అవుతున్నారు.
ప్రస్తుతం ఆటో మార్కెట్లో హీరో (Hero), TVS, ఓలా (OLA) వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రతి కంపెనీ తమ స్కూటీని మెరుగైన రేంజ్, ఎక్కువ ఫీచర్లు, హై స్పీడ్‌తో లాంచ్ చేస్తోంది. స్పీడ్ సైతం బాగానే ఉండటం, ఇంధర ధరలతో పోల్చితే ఛార్జింగ్ కోసం తక్కువ ఖర్చు కనుక ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు పెరుగుతున్నాయి.
కొంతమంది ఎక్కువ రేంజ్ కోరుకుంటే, మరికొందరికి ఫీచర్లు, సర్వీస్ నెట్‌వర్క్ చాలా ముఖ్యమైనవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేముందు వాటి బ్యాటరీ కెపాసిటీ, ధర, స్పీడ్, చార్జింగ్, రేంజ్ వంటి అనేక అంశాలను అర్థం చేసుకోవాలి. సరైన ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) మీ రోజువారీ ప్రయాణాన్ని చాలా చౌకగా, తేలిక చేస్తుంది.
Also Read: Car Mileage Guide: కారు మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఇవి పాటిస్తే మీ ఖర్చులు తగ్గుతాయి
OLA, TVS ఎలక్ట్రిక్ స్కూటర్ల పవర్‌ఫుల్ ఫీచర్లు, స్పీడ్OLA Electric తన ఫీచర్లు, ఎక్కువ రేంజ్ ఇచ్చే కారణంగా చాలా పాపులర్ అయింది. ఓలా కంపెనీకి చెందిన పలు మోడల్స్ లాంగ్ రేంజ్, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి సౌకర్యాలతో వస్తున్నాయి. టాప్ స్పీడ్ విషయంలో కూడా OLA స్కూటర్లు చాలా పవర్‌ఫుల్. మరోవైపు TVS iQube దాని నమ్మకమైన పర్ఫార్మెన్స్, స్మూత్ రైడ్ కోసం ఇష్టపడుతున్నారు.
TVS కంపెనీ బలమైన సర్వీస్ నెట్‌వర్క్ కూడా వినియోగదారులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా భావిస్తారు. టీవీఎస్ iQubeలో రోజువారీ వాడకానికి సరిపోయేలా బ్యాలెన్స్‌డ్ రేంజ్, మంచి ఫీచర్లు లభిస్తాయి. చాలామంది ఫ్యామిలీ కస్టమర్లు TVS ఈవీ కొనాలని చూస్తున్నారు. రెండు కంపెనీలు ఈవీ మార్కెట్లో తమ పట్టును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!
సవాల్ విసురుతున్న Hero Vida Hero MotoCorp కి చెందిన Vida Electric Scooter సిరీస్ ఇప్పుడు మార్కెట్లో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. Hero కంపెనీపై ఉన్న బ్రాండ్ నమ్మకం, సర్వీస్ నెట్‌వర్క్ దీనిని మార్కెట్లో బెస్ట్ ఈవీగా మారుతోంది. Vida లో మంచి ఫీచర్లు, రిమూవబుల్ బ్యాటరీ, అద్భుతమైన డిజైన్ ఇచ్చారు. అయితే కొన్ని విషయాల్లో OLA ఎక్కువ టెక్నాలజీ, లాంగ్ రేంజ్ ఆఫర్ చేస్తుండగా TVS మెరుగైన నమ్మకానికి, స్థిరమైన పర్ఫార్మెన్స్‌తో మార్కెట్లో దూసుకెళ్తోంది.
కస్టమర్ లాంగ్ రేంజ్, స్పీడ్ లాంటి ఎక్కువ ఫీచర్లు కావాలనుకుంటే OLA బెస్ట్ ఆప్షన్ కావచ్చు. సర్వీస్ నెట్ వర్క్ సమస్య వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. నమ్మకమైన సర్వీస్, పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి TVS, Hero మెరుగైన ఛాయిస్ అని చెప్పవచ్చు.
