Tata Tiago EV 2026: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సామాన్యుడికి ఎలక్ట్రిక్ కారు కలని నిజం చేస్తూ, సరికొత్త హంగులతో 2026 టాటా టియాగో ఈవీని మే28న లాంచ్ చేసింది. ఈ కొత్త వెర్షన్ కేవలం అప్‌డేట్ మాత్రమే కాదు, ధర, టెక్నాలజీ పరంగా ఒక పెద్ద సంచలనంగా మారబోతోంది. 

Continues below advertisement

టాటా టియాగో ఈవీ 2026 ధర, వేరియంట్స్‌

ఈ లాంచ్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచిన అంశం ధర. పాత మోడల్‌ 7.99 లక్షల నుంచి 11.14 లక్షల మధ్య ఉండేది. అయితే టాటా మోటార్స్‌ వ్యూహాత్మకంగా కొత్త 2026 మోడల్ ధరను గణనీయంగా తగ్గించి, ప్రారంభ ధరను కేవలం 6.99 లక్షలుగా నిర్ణయించింది. ఇది భారత్‌లో అత్యంత సరమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. 

సరికొత్త బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌

వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు టాటా మోటార్స్ బ్యాటరీ యాజ్‌ ఏ సర్వీస్‌ విధానంలో మార్పులు చేసింది. ఈ ప్లాన్ కింద మీరు కారును కేవలం 4.69 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. బ్యాటరీ కోసం మీరు విడిగా కొనుగోలు చేయనవసరం లేదు. మీరు కారును నడిపిన ప్రతి కిలోమీటరుకు సుమారు 2.6 రూపాయల చొప్పున ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది మొబైల్ రీఛార్జ్ లాంటి సౌకర్యాన్ని వాహదారులకు కల్పిస్తోంది. 

Continues below advertisement

కొత్త లుక్- కొత్త రంగు

కొత్త టియాగో ఈవీ చూడటానికి మరింత షార్ప్‌గా , స్పోరీగా కనిపిస్తోంది. ముందుభాగంలో కొత్త ఎల్‌ఈడీ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు కారుకు సరికొత్త రూపాన్ని ఇచ్చాయి. వెనుక భాగం స్టైలిష్‌గా ఉండే కనెక్టెడ్‌ ఎల్‌ఈడీ టైల్‌- ల్యాంప్స్‌ ఈ మోడల్‌కు ప్రత్యేకత. ఈసారి టాటా మోటార్స్‌ ప్రకృతి ప్రేరణతో ఆరు కొత్త రంగులను పరిచయం చేసింది. ఇందులో డెహ్రడూన్ డ్యూ, పాంగాంగ్‌ పల్స్‌ వంటి రంగులు యువతను ఆకట్టుకోనున్నాయి. 

ప్రీమియం క్యాబిన్, స్మార్ట్ ఫీచర్లు

లోపలి భాగంలో కూడా భారీ మార్పులు జరిగాయి. డాష్ బోర్డులు డ్యూయల్‌ టోన్ థీమ్‌తో మరింత మోడరన్‌గా తీర్చిదిద్దారు. ఇందులో పెద్ద 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది వైరలెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేస్తుంది. వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జింగ్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏసీ వెంట్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 

కొత్తగా వచ్చిన టియాగో ఈవీలోని అన్ని వేరియంట్స్‌లో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఇస్తోంది. ఇందులో 360డిగ్రీ కెమెరా, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్, హిల్ స్టార్ట్ అసిస్ట్‌ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు జోడించారు. వర్షం పడితే ఆటోమేటిక్‌గాఆన్‌ అయ్యే వైప్లు, చీకటి పడితే వెలిగే హెడ్‌ లైట్లు కూడా ఉన్నాయి. 

టాటా టియాగో ఈవీ 2026 మైలేజ్‌, బ్యాటరీ వారంటీ వివరాలు 

టియాగో ఈవీ రెండు రకాల బ్యాటరీ సైజుల్లో లభిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్‌ పూర్తి ఛార్జింగ్‌పై 293కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో కేవలం 35 నిమిషాల్లోనే పది శాతం నుంచి 80శాతం వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులకు మరింత భరోసా ఇచ్చేలా, 24kWh బ్యాటరీ వెర్షన్ కొనే మొదటి యజమానులకు బ్యాటరీ లైఫ్‌టైమ్ వారంటీని టాటా మోటార్స్ ప్రకటిస్తోంది.