Car Mileage Guide: పెట్రోల్, డీజిల్‌తో పాటు CNG ధరలు పెరుగుతున్నందున, ప్రతి వాహనదారుడు తమ కార్లు మంచి మైలేజ్ ఇవ్వాలని కోరుకుంటారు. ఎక్కువ మైలేజీ ద్వారా తక్కువ ఇంధనంలో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. అయితే, తరచుగా కార్ మైలేజ్ అకస్మాత్తుగా తగ్గిపోతుంది. కారు ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటుంది. ఇది నేరుగా మీ నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపుతుంది.

Continues below advertisement

ఈ నెలలో భారత్‌లో నాలుగుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. చమురు కంపెనీలు ధరలు పెంచుతూ పోవడంతో ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారం పడుతుంది. సీఎన్జీ ధరలు సైతం పెరుగుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాలలో హైదరాబాద్‌లోనే అధిక ధర ఉంది. ముంబై కన్నా ఢిల్లీ, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లో సీఎన్జీ ధరలు అధికంగా ఉన్నాయి. కనుక ఈ సమస్య తరచుగా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వస్తుంది. మీ కారు మైలేజ్‌ను తగ్గించే కొన్ని కారణాలు ఇక్కడ తెలియజేస్తున్నాం. 

టైర్లలో గాలి

తక్కువ గాలి ఉన్న టైర్లు కారు ఇంజిన్‌పై రెట్టింపు ఒత్తిడిని కలిగిస్తాయి. టైర్లలో ప్రెజర్ తగ్గినప్పుడు, రోడ్డుపై ఘర్షణ మరింత పెరుగుతుంది. దీనిని లాగడానికి ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఇంధన వినియోగం వేగంగా పెరుగుతుంది. వీలున్నప్పుడు టైర్ ప్రెజర్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

Continues below advertisement

 మురికిగా ఉన్న ఎయిర్ ఫిల్టర్ 

కారు ఎయిర్ ఫిల్టర్ మనుషులకు ఊపిరితిత్తుల వలె పనిచేస్తుంది. ఇందులో దుమ్ము, ధూళి పేరుకుపోయినప్పుడు, ఇంజిన్‌కు తగినంత గాలి  అందదు. దీని కారణంగా కంబషన్ సరిగ్గా జరగకపోవడంతో కారు మైలేజ్ అకస్మాత్తుగా తగ్గుతుందని గ్రహించాలి. 

ఈ అలవాటు ఓ కారణం కావొచ్చు 

చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్ పెడల్‌పై కొద్దిగా కాలు పెట్టి ఉంచుతారు. లేదా రాంగ్ గేర్‌లో కారును నడుపుతారు. తక్కువ వేగంతో ఎక్కువ నెంబర్ గేర్ లేదా ఎక్కువ వేగంతో తక్కువ గేర్ ఉపయోగించడం ఇంజిన్‌పై ప్రభావం చూపుతుంది. ఈ అలవాటు ఒక్క క్షణంలోనే మైలేజ్‌ను దెబ్బతీస్తుంది. 

Read Also: Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు  

కారు స్పార్క్ ప్లగ్ 

కారు స్పార్క్ ప్లగ్ పాతది కావడం లేదా మురికిగా ఉంటే, అది సరిగ్గా స్పార్క్ చేయదు. దాంతో సిలిండర్ లోపల ఉన్న మొత్తం ఇంధనం మండదు. ఉపయోగించకుండానే సైలెన్సర్ నుంచి బయటకు రావడంతో ఇది కూడా మైలేజ్ తగ్గడానికి కారణమవుతుంది.

అధిక బరువు, అనవసరమైన AC వినియోగం

కారు డిక్కీలో అవసరానికి మించి సామాన్లు, లగేజీ ఉంచడం నేరుగా కారు మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. బరువు ఎంత ఎక్కువగా ఉంటే, ఇంజిన్ అంత ఎక్కువ ఫ్యూయల్ తీసుకుంటుంది. దీనితో పాటు, ట్రాఫిక్ జామ్‌లో ACని ఆన్‌లో ఉంచడం వల్ల మీ పెట్రోల్, డీజిల్ వేగంగా అయిపోతుంది.

Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!