Cab Services In India | సొంతంగా వాహనం లేని వారితో పాటు వేరే నగరాలకు వెళ్లిన సమయంలో క్యాబ్ సర్వీసుల ద్వారా మీకు కావాల్సిన చోటుకు వెళ్తుంటారు. భారత్‌లో గత కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో మరిన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి. వియత్నాంకు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత్‌లో తన కొత్త ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. దీనికి గ్రీన్ ఎస్‌ఎమ్ (Green SM) అని పేరు పెట్టారు. ఈ సర్వీసులను మొదట ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత క్రమంగా దీనిని ఇతర నగరాలకు కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. దేశంలో పర్యావరణ హితమైన (ఈకో-ఫ్రెండ్లీ), పూర్తిగా ఎలక్ట్రిక్ టాక్సీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడం కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం.

Continues below advertisement

ఈ ప్లాన్‌లో భాగంగా కంపెనీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ టాక్సీలను అందుబాటులోకి తేనుంది. దాదాపు 15,000 ఎలక్ట్రిక్ టాక్సీల బెడాని (ఫ్లీట్) సిద్ధం చేయాలని సంస్థ ప్లాన్ చేసింది. ఈ టాక్సీలలో ప్రధానంగా విన్‌ఫాస్ట్ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కార్లను వినియోగించనున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా, ప్రయాణికులకు కంఫర్ట్ జర్నీ అందించేలా, ఈ వాహనాలను ప్రత్యేకంగా రైడ్ హెయిలింగ్, టాక్సీ సేవల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

Also Read: పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!

Continues below advertisement

కిలోమీటరుకు ఎంత చెల్లించాలి ఈ సర్వీస్‌కు సంబంధించి ప్రత్యేకమైన అంశం దీని అద్దె  మోడల్ అని చెబుతున్నారు. నివేదికల ప్రకారం, ప్యాసింజర్స్ వద్ద నుంచి ఒక కిలోమీటరుకు దాదాపు రూ. 8 ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ప్రతిరోజూ క్యాబ్‌లలో ప్రయాణించే వారికి, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే వారికి, సిటీలో ప్రయాణించే వారికి నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. గ్రీన్ ఎస్‌ఎమ్ అనేది కేవలం ఒక టాక్సీ సేవ మాత్రమే కాదు. విన్‌ఫాస్ట్ కంపెనీ ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లకు బ్రాండింగ్‌తో పాటు తక్కువ సమయంలో గుర్తింపును తీసుకురావాలని భావిస్తోంది.

Also Read: Electric Scooter కొనేముందు ఇది తెలుసుకోండి.. Hero, TVS లేదా OLA లలో బెస్ట్ ఏది

ఎకో-ఫ్రెండ్లీగా ఈ ఎలక్ట్రిక్ కార్లుఈ ప్రాజెక్ట్ మరో కోణం ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ ఆధారిత సర్వీస్. దాంతో ఎలాంటి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల అవసరం ఉండదు. దీనివల్ల కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. భారత ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తోంది. కనుక ఇటువంటి సేవలు భవిష్యత్తులో ఎంతో మేలు చేయనున్నాయి. 

ఈ సేవను కేవలం యాప్ ఆధారిత టాక్సీలకే పరిమితం చేయకుండా ఒక ఫ్లీట్ మోడల్‌గా నడపాలని కూడా కంపెనీ యోచిస్తోంది. అంటే డ్రైవర్లు, వాహనాలు, సేవల నాణ్యతపై కంపెనీకి డైరెక్ట్ కంట్రోల్ ఉంటుంది. దీనివల్ల సేవలను నిలకడగా, మరింత మెరుగ్గా అందించడానికి వీలవుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.