Triumph Bike Prices Increased In India For 350cc Range: ప్రముఖ ప్రీమియం బైక్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ ఇండియాలో తన 350 సీసీ మోటార్ సైకిల్ సిరీస్ ధరలను సవరించింది. కంపెనీ లైనప్ లోని స్పీడ్ 400, స్పీడ్ టీ4, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ సీ, త్రక్స్టన్ 400 మోడళ్లపై రూ. 5,000 వరకు భారం పడింది. లేటెస్ట్ ప్రైస్ హైక్ ఈ నాలుగు మోడళ్లకు వర్తిస్తుంది. ఈ ధరల పెంపు తర్వాత ట్రయంఫ్ స్పీడ్ 400 కొత్త ధర రూ. 2.34 లక్షలకు చేరింది. గతంలో దీని ధర రూ. 2.32 లక్షలుగా ఉండేది. అంటే దీనిపై రూ. 2,000 పెరిగింది. మరోవైపు స్పీడ్ టీ4 మోడల్ పై అత్యధికంగా రూ. 4,000 పెరగడంతో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.99 లక్షలకు చేరుకుంది.
త్రక్స్టన్, స్క్రాంబ్లర్ మోడళ్లపై రూ. 5,000 పెంపు..
టాప్ ఎండ్ మోడల్స్ అయిన త్రక్స్టన్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ సీ బైకుల ధరలు ఏకంగా రూ. 5,000 చొప్పున పెరిగాయి. దీంతో మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 2.70 లక్షలు, రూ. 2.94 లక్షలకు చేరాయి. ఈ ధరలన్నీ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ కు వర్తిస్తాయి. స్పీడ్ టీ4 మోడల్ లాంచ్ అయిన తర్వాత ధర పెరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. గతంలో వచ్చిన జీఎస్టీ 2.0 ట్రాన్సిషన్ రూల్స్ వల్ల డౌన్‌సైజ్డ్ ప్లాట్‌ఫారమ్‌కు మారని ఏకైక మోడల్ ఇదే. దీనివల్ల పాత 399 సీసీ వెర్షన్ కంటే సరికొత్త 350 సీసీ స్పీడ్ టీ4 ధర కొంచెం ఎక్కువగా ఉంది.
మెకానికల్ గా అవే ఇంజన్లు..
ధరలు పెరిగినా బైకుల మెకానికల్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్స్ అన్నీ ట్రయంఫ్ 350 సీసీ ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నాయి. అయితే పవర్ అవుట్‌పుట్ మాత్రం మోడల్ ను బట్టి మారుతుంది. స్పీడ్ టీ4 మోడల్ 29 హెచ్ పీ పవర్, 31 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పాత 398.15 సీసీ ఇంజన్ 31 హెచ్ పీ పవర్ ఇచ్చేది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ సీ మోడళ్లు 37 హెచ్ పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ఇస్తాయి. ఈ లైనప్ లో టాప్ మోడల్ అయిన త్రక్స్టన్ 400 బైక్ 40 హెచ్ పీ పవర్, 32 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది రీసెంట్ గా వచ్చిన ట్రాకర్ 400 పర్ఫార్మెన్స్ కు ఈక్వల్ గా ఉంటుంది.
Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!
ప్రీమియం బైక్ లవర్స్ పై ఇంపాక్ట్..
ఇండియాలో ట్రయంఫ్ 400 సిరీస్ బైకులకు మంచి డిజైన్, పర్ఫార్మెన్స్, బ్రాండ్ వాల్యూ వల్ల సూపర్ క్రేజ్ ఉంది. బైక్ కొనే ప్లాన్ లో ఉన్న కస్టమర్లు ఈ కొత్త ధరలను ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. కొత్త రేట్లు అమలులోకి వచ్చినప్పటికీ మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకునేలాగే ట్రయంఫ్ ధరలను కంట్రోల్ లో ఉంచింది. కాకపోతే కస్టమర్లు మునుపటి కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బ్రాండ్స్ కు పోటీగా ఉన్న ఈ సెగ్మెంట్ లో ట్రయంఫ్ తీసుకున్న ఈ నిర్ణయం సేల్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో వేచి చూడాలి.
