Towel in Stomach:


కడుపు నొప్పితో బాధితురాలి యాతన..


యూపీలో ఓ వైద్యుడు మహిళకు ఆపరేషన్‌ చేసిన కడుపులోనే టవల్ పెట్టి మర్చిపోయి కుట్లు వేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెలివరీ కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసిన సమయంలో టవల్‌ను లోపలే పెట్టి మర్చిపోయాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆ మహిళ మళ్లీ ఆసుపత్రికి వస్తే కానీ...అసలు విషయం బయట పడలేదు. దీనిపై వైద్యాధికారులు విచారణకు ఆదేశించారు. బన్స్ ఖేరి గ్రామంలో జరిగిందీ ఈ ఘటన. చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించిన వివరాల ప్రకారం...నజ్రానా అనే మహిళ పొత్తి కడుపులో టవల్ ఉండిపోయింది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధితురాలు ఆసుపత్రిలో చేరింది. దాదాపు 5 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు అక్కడి వైద్యులు. అయితే...వాతావరణం చల్లగా ఉండడం వల్లే కడుపు నొప్పి వస్తోందంటూ...పొంతన లేని సమాధానం చెప్పారు వైద్యులు. పేషెంట్‌ని డిశ్చార్చ్ చేశారు. ఆ తరవాత కూడా కడుపు నొప్పి తీవ్రమవడం వల్ల ఆమె మరో  ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్ చేస్తే కానీ...అసలు విషయం తెలియలేదు. వెంటనే అలెర్ట్ అయిన వైద్యులు ఆమెకు సర్జరీ చేసి ఆ టవల్‌ను బయటకు తీశారు. బాధితురాలి
భర్త...నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ సింఘాల్ దీనిపై స్పందించారు. "మీడియా ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పటికే నోడల్ ఆఫీసర్‌కు ఆదేశాలిచ్చాను. పూర్తి స్థాయి విచారణ జరపాలని తేల్చి చెప్పాను. విచారణ పూర్తైన తరవాతే పూర్తి వివరాలు చెప్పగలను" అని అన్నారు. లిఖిత పూర్వకంగా ఆ వైద్యుడిపై ఎలాంటి కేసు నమోదు కాకపోయినప్పటికీ...విచారణ మాత్రం తప్పకుండా జరుగుతుందని వెల్లడించారు. 


గతంలోనూ..


గతంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎవరైనా ఆకలేస్తే నచ్చినవి వండుకుని తింటారు. లేదంటే ఆర్డర్ చేసుకుని లాగించేస్తారు. కానీ...కొందరు వెరైటీ ఫుడ్ తీసుకుంటారు. కొందరు మట్టి తిని బతికితే ఇంకొందరు ఒట్టి బియ్యం మింగేస్తారు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి చెంచాలు తినేశాడు. అవును. ఓ ఏడాది కాలంగా ఇలా స్పూన్‌లను మింగేయటం అలవాటు చేసుకున్నాడట 32 ఏళ్ల విజయ్. చివరకు కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఎంతో శ్రమ పడిన డాక్టర్లు...అతడి పొట్టలో నుంచి 62 చెంచాలు బయటకు తీసి ఆశ్చర్యపోయారు. ICUలో ఉంచి దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ చేస్తే కానీ...ఇవి బయటపడలేదు. "చెంచాలు తింటున్నావా" అని వైద్యులు అడిగితే ఆ బాధితుడు "అవును ఏడాది నుంచి మింగేస్తున్నా" అని సమాధానమిచ్చాడట. ఇది విని డాక్టర్లు అవాక్కయ్యారు. "ఏడాదిగా ఇలా స్పూన్లు మింగేస్తున్నాడు. రెండు గంటల పాటు శ్రమిస్తే కానీ అవన్నీ బయటకు తీయలేకపోయాం" అని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఇలాంటి కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 


Also Read: Kanjhawala Death Case: కంజావాలా కేసులో ఈ చిక్కుముడులు వీడతాయా? అసలెందుకు ఇన్ని అనుమానాలు?