UP leader Ajay Rai controversial comments: సున్నితమైన వివాదాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన కాంగ్రెస్ నేతలు దారి తప్పుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్ హైకమాండ్ చిక్కులు ఎదుర్కొంటోంది. తాజాగా యూపీ కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. పాకిస్తాన్ మీడియా ఆయన మాటల్ని ప్రసారం చేసి భారత్ ను ఎగతాళి చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పహల్గామ్ దాడిపై కేంద్ర ప్రభుత్వం "పెద్ద మాటలు చెప్పి, చర్యలు తీసుకోవడం లేదు" అని ఇటీవల విమర్శలు చేశారు. రాఫెల్ యుద్ధ విమానా బొమ్మను చూపిస్తూ రాఫెల్ విమానాలు కొనుగోలు చేశారు, కానీ అవి హ్యాంగర్‌లలో నిమ్మకాయలు, మిర్చీలతో వేలాడుతున్నాయని జోకులు వేశారు. ఉగ్రవాదులపై, వారిని సమర్థించే వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అజయ్ రాయ్ వ్యాఖ్యలను పాకిస్థాన్ మీడియా, ముఖ్యంగా ARY న్యూస్, విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ వీడియోను చూపించి పాకిస్తాన్ నెటిజన్లు భారత్ పై సెటైర్లు వేస్తున్నారు.
అజయ్ రాయ్ వ్యవహారంపై భారత సైన్యం యొక్క మనోబలాన్ని దెబ్బతీసే చర్య బీజేపీ మండిపడ్డారు. "పాకిస్థాన్‌కు సహకారం అందించే దేశద్రోహం"గా ఆరోపించారు. "రాఫెల్ బొమ్మ విమానంతో కాంగ్రెస్ భారత సైన్యం మనోబలంతో ఆడుకుంటోంది. ఇది రాహుల్ గాంధీ సూచనల మేరకు జరుగుతోందని బీజేపీ ఆరోపించారు. అజయ్ రాయ్ వ్యాఖ్యలు "దేశద్రోహం" కిందకు వస్తాయని, కాంగ్రెస్ పాకిస్థాన్ అజెండాను అనుసరిస్తోందని ఆరోపించారు.
అయితే అజయ్ రాయ్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాఫెల్‌ను ఉదాహరణగా చూపించానని.. ప్రజలు పాకిస్తాన్ పై ఎప్పుడు దాడి చేస్తారని అడుగుతున్నారని ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలను "నీచమైనవి" అని మండిపడ్డారు.
అజయ్ రాయ్ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.