UP Election 2022: రాజకీయాల్లోకి 'పుష్ప' ఫీవర్.. 'శ్రీవల్లి' పాటను రీమేక్ చేసిన కాంగ్రెస్

ABP Desam Updated at: 04 Feb 2022 06:50 PM (IST)
Edited By: Murali Krishna

పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ రీమేక్ చేసింది. ఎన్నికల ప్రచారం కోసం ఈ పాటను వినియోగిస్తోంది.

పుష్ప సాంగ్ రీమేక్

NEXT PREV

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పుష్ప క్రేజ్ సౌంత్ ఇండియాతో పాటు ఉత్తర భారతంలోని మాములుగా లేదు. ఇప్పటికే సినిమా స్టార్లతో పాటు క్రికెటర్లు కూడా పుష్ప సినిమా డైలాగులు, పాటలతో హోరెత్తించేస్తున్నారు. ముఖ్యంగా శ్రీవల్లి పాట ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అయితే తాజాగా పుష్ప ఫీవర్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. 






పుష్ప సినిమాలోని చూపే బంగారమాయేనే శ్రీవల్లి సాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం రీమేక్ చేసింది. ఆ మ్యూజిక్‌తో 'తూ హై గజాబ్ యూ, యూపీ, తేరీ కసమ్, యూపీ'.. అంటూ వీడియో రూపొందించింది.


ఇందులో రాణీ లక్ష్మీబాయి సహా ఎంతో మంది గొప్ప వ్యక్తుల గురించి ప్రస్తావించారు. దీంతో పాటు రాష్ట్ర గొప్పతనాన్ని తెలియజేశారు. వీడియోలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


కాంగ్రెస్ ఒంటరి పోరు..


ఈ సారి ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లోనూ బరిలోకి దిగుతోంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మాట్లాడారు.



పూర్తి సామర్థ్యంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. మొత్తం 403 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయడం 30 ఏళ్లలో ఇదే తొలిసారి. ప్రజలను పీడిస్తోన్న, బాధపెడుతోన్న సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతోంది.                                              - ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి


యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లను కాంగ్రెస్.. మహిళలకే కేటాయించింది. అయితే సీఎం అభ్యర్థిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రియాంక గాంధీనే సీఎం అభ్యర్థని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: UP Best State Tableau: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర శకటానికి అవార్డ్.. రిపబ్లిక్ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా


Also Read: Asaduddin Owaisi Attack: ఓవైసీకి Z కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్ర ప్రభుత్వం

Published at: 04 Feb 2022 06:32 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.