ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి భారత ప్రభుత్వం భద్రతను పెంచింది. ఓవైసీకి Z కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కల్పించింది. ఓవైసీ కారుపై నిన్న దుండగులు కాల్పులు జరిపడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన భద్రతపై సమీక్ష నిర్వహించి Z కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది.






ఏం జరిగింది?


ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్ల కాల్పులు జరిపారు.


యూపీ మేరట్‌లోని కిథౌర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని నేను దిల్లీకి వెళ్తోన్న సమయంలో నా వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు గుంపుగా వచ్చారు. ఇద్దరు కాల్పులు చేశారు. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దీంతో నేను మరో వాహనంలో వెళ్లిపోయాను.                                                     "


-అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధినేత


ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.


దర్యాప్తునకు విజ్ఞప్తి..


కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోదీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను కూడా కలుస్తానన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్​ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.


ఇదంతా డ్రామా..


ఓవైసీపై జరిగిన దాడిపై యూపీ భాజపా కీలక వ్యాఖ్యలు చేసింది. సానుభూతి కోసమే ఓవైసీ ఈ దాడి చేయించుకుని ఉంటారని ఆరోపించింది. ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకే ఈ డ్రామా చేసినట్లు విమర్శించింది. అయితే ఈ వ్యాఖ్యలను ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసి ఎవరు డ్రామాలు ఆడుతున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు.


Also Read: CM Channi Nephew Arrest: పంజాబ్ సీఎం చన్నీకి ఈడీ షాక్.. మేనల్లుడు భూపేందర్ సింగ్ అరెస్ట్