ABP  WhatsApp

UP News: క్లాసులు బంక్ కొట్టి సినిమా హాల్స్, పార్కుల్లోకి వెళ్లొద్దు- ఇక నుంచి నో ఎంట్రీ!

ABP Desam Updated at: 29 Jul 2022 05:36 PM (IST)
Edited By: Murali Krishna

UP Child Rights: ఇక నుంచి క్లాసులు డుమ్మా కొట్టి సినిమా హాళ్లు, పార్కులకు వెళ్లే విద్యార్థులను అనుమతించవద్దని అక్కడ కొత్త రూల్ పెట్టారు.

క్లాసులు బంక్ కొట్టి సినిమా హాల్స్, పార్కుల్లోకి వెళ్లొద్దు- ఇక నుంచి నో ఎంట్రీ!

NEXT PREV

UP Child Rights: స్కూల్ యూనిఫాం ధరించిన పిల్లలను ఇక నుంచి మాల్స్, సినిమా హాల్స్, జూలు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో అనుమతించకూడదని ప్రభుత్వానికి ఓ లేఖ అందింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (State Commission for Protection of Child Rights) ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖ రాసింది.






ఎందుకంటే?


పాఠశాలల పని వేళల్లో విద్యార్థినీ, విద్యార్థులను బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించొద్దని ఈ లేఖలో కమిషన్ కోరింది. విద్యార్థినీ, విద్యార్థులు తరచూ పాఠశాలకు డుమ్మా కొట్టి, పార్కులు, రెస్టారెంట్లు, జంతు ప్రదర్శనశాలలు వంటివాటికి వెళ్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొంది.



ఈ ఆదేశాలు ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులకు వర్తిస్తాయి. పాఠశాలలు, కళాశాలల పని వేళల్లో స్కూలు యూనిఫాం ధరించినవారు పార్కులు, మాల్స్, సినిమా హాళ్ళు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడంపై నిషేధం విధించాలి. - డాక్టర్ సుచిత చౌదరి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు


విద్యార్థినీ, విద్యార్థులు తరగతులకు హాజరవడానికి బదులు ఇటువంటి ప్రదేశాల్లో గడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె చెప్పారు. ఇటువంటి సందర్భాల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని అందుకే ఇలా కోరినట్లు తెలిపారు.


యోగి సర్కార్


ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమార్కుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఇలాంటి వేళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాల వేళల్లో వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రదేశాల్లోకి అనుమతించవద్దని తల్లిదండ్రులు కోరుతున్నారు.


Also Read: Health Warnings on Cigarette Pack: '2 గాజులు అమ్ముకో అక్కర్లేదు- పొగాకు తాగితే పోతారు'


Also Read: BJP Praveen Nettaru Murder Case: భాజపా యువ నేత హత్య కేసు NIAకు అప్పగించిన సీఎం

Published at: 29 Jul 2022 05:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.