జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న భద్రతా దళాలు అతడిని అడ్డుకున్నాయి. ఈ మేరకు దిల్లీ పోలీసులు తెలిపారు.







కారుతో పాటు


డోభాల్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయన బంగ్లాలోకి ఓ వ్యక్తి కారుతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి అతడ్ని ఆపేశారు. వెంటే అదుపులోకి తీసుకుని ప్రాథమిక దర్యాప్తు చేశారు.


ఆ దుండగుడు బెంగళూరుకు చెందిన శాంతను రెడ్డిగా పోలీసులు తెలుసుకున్నారు. అతడి మానసిక స్థితి బాగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఆ కారును కూాడా అద్దెకు తీసుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.


ఉదయం 7.30-8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో డోభాల్ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై అత్యున్నత స్థాయి దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.


నా బాడీలో చిప్ ఉంది


దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యపరిచాయి. తన శరీరంలో ఎవరో చిప్ పెట్టారని.. తనను ఎవరో కంట్రోల్ చేస్తున్నారని ఆ వ్యక్తి చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఆ వ్యక్తి శరీరంలో ఎలాంటి చిప్ లేదని.. అతని మానసిక స్థితి సరిగాలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.


Also read: Covid Update: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 30,615 మందికి వైరస్



Also Read: Ravidas Jayanti 2022: పంజాబ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ చెక్క భజన!