దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. 514 మంది మృతి చెందారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు 11 శాతం పెరిగాయి. 82,988 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- యాక్టివ్ కేసులు: 3,70,240
- డైలీ పాజిటివిటీ రేటు: 2.45%
- మొత్తం రికవరీలు: 4,18,43,446
- మొత్తం వ్యాక్సినేషన్: 173.86 కోట్ల డోసులు
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 2,831 కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. ఇందులో 351 ఒమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,47,746కు చేరింది. మరణాల సంఖ్య 1,43,451కి పెరిగింది.
దిల్లీ
దిల్లీలో కొత్తగా 756 కరోనా కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 1.52గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 18,52,662కు పెరిగింది. మరణాల సంఖ్య 26,081కి చేరింది.
Also Read: Ravidas Jayanti 2022: పంజాబ్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ చెక్క భజన!