Digitalisation in India: భారత్‌లో డిజిటల్ విప్లవంపై United Nations General Assembly (UNGA) ప్రెసిడెంట్ డెనిస్ ఫ్రాన్సిస్ ప్రశంసలు కురిపించారు. దేశంలోని మారుమూల గ్రామాలకూ బ్యాంకింగ్ సర్వీస్‌లను విస్తరించారని కొనియాడారు. ఈ కారణంగానే భారత్‌లో దాదాపు 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని స్పష్టం చేశారు. ఇదంతా గత ఆరేళ్లలోనే జరిగిందని వెల్లడించారు. కేవలం స్మార్ట్‌ఫోన్‌లతో ఈ అద్భుతం సాధించారంటూ భారత్‌లోని డిజిటలైజేషన్ గురించి గొప్పగా మాట్లాడారు. గతంలో ఇండియాలోని గ్రామాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేదని కాదని, బ్యాంకింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడి నుంచైనా చెల్లింపులు చేసే వెసులుబాటు వచ్చిందని వివరించారు. డిజిటలైజేషన్ వల్ల దేశం అభివృద్ధి చెందుతుందనడానికి ఇదే ఉదాహరణ అని స్పష్టం చేశారు.
"డిజిటలైజేషన్ వల్ల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది. భారత్‌నే ఉదాహరణగా తీసుకోండి. కేవలం స్మార్ట్‌ఫోన్‌లతో అక్కడ 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. కేవలం ఆరేళ్లలో అక్కడ డిజిటల్ విప్లవం వచ్చింది. అంతా ఆ మొబైల్ సాయంతో ఎక్కడంటే అక్కడ చెల్లింపులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవాళ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. ఈ కారణంగానే ఫోన్‌ల ద్వారా బ్యాంకింగ్ సర్వీస్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి"
- డెనిస్ ఫ్రాన్సిస్, UNGA ప్రెసిడెంట్
గ్లోబల్ సౌత్‌లో ఏ దేశంలోనూ ఈ స్థాయిలో డిజిటలైజేషన్ లేదని డెనిస్ వెల్లడించారు. ఆయా దేశాల్లో డిజిటల్ విప్లవం కోసం ఇంకా చేయాల్సింది ఉందని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందేవే కావని, కానీ భారత్‌లో అంతా మారిపోయిందని వివరించారు. ఇదే స్థాయిలో మిగతా దేశాల్లోనూ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అన్నారు.
Also Read: Marriage Course: ఆ యూనివర్సిటీలో మ్యారేజ్ కోర్స్ కూడా ఉంది, సిలబస్ ఏముంటుందంటే?