ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడి తీవ్ర రూపం దాల్చడంతో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాకు తలవంచేది లేదని తుది వరకు తమ బలగాలు పోరాడతాయన్నారు. దేశం కోసం పోరాడలనుకునే పౌరులకు ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు.
40 మంది మృతి
ఉక్రెయిన్‌పై రష్యా ముప్పేట దాడి చేస్తోంది. ఇప్పటివరకు 40 మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు, 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.
మరోవైపు 50 మంది రష్యా ఆక్రమణదారులను హతమార్చినట్లు ఉక్రెయిన్ సైన్యం స్పష్టం చేసింది.
తూర్పు ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపడుతున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన వెంటనే వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని కీలక సైనిక స్థావరాలపై శతఘ్నులతో విరుచుకుపడింది. ఉత్తర, దక్షిణ, తూర్పు వైపు నుంచి ముప్పేట దాడి చేస్తున్నాయి.
భారత్ సాయం కావాలి
మరోవైపు ఉక్రెయిన్ మాత్రం భారత్ సంపూర్ణ మద్దతు కావాలని కోరుతోంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆ దేశ రాయబారి ఇగోర్ పొలిఖా పేర్కొన్నారు. తక్షణమే యుద్ధం నిలువరించే దిశగా భారత్ చర్యలు తీసుకోవాలి కోరారు. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.
Also Read: Ukraine Russia War: యుద్ధం అయిపోయాక రష్యా పరిస్థితేంటి? పుతిన్ వ్యాఖ్యలకు అర్థమేంటి?