రష్యా- ఉక్రెయిన్​ మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్​లో ఉంటున్న భారతీయులను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా విద్యార్థులు తాత్కాలికంగా తక్షణం స్వదేశానికి తిరిగిరావాలని పేర్కొంది.







ఈ మేరకు ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్​కు అనవసర ప్రయాణాలు కూడా మానుకోవాలని తెలిపింది.


ఈనెల 16న ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇంటిలిజెన్స్ పేర్కొంది. దీంతో ఉక్రెయిన్‌లో ఉంటోన్న తమ పౌరులను స్వదేశానికి రావాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. భారత్ కూడా ఇందుకే ఈ నిర్ణయం తీసుకుంది.


ఆక్రమణ తప్పదా


చర్చలకు ఓకే అంటూనే ఉక్రెయిన్​ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఈనెల 16న రష్యా తమ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని ఉక్రెయిన్​ అధ్యక్షుడు కూడా అన్నారు.


సరిహద్దులో


ఉక్రెయిన్​ సరిహద్దుల్లో ప్రస్తుతం వాతావరణం ఉత్కంఠగా ఉంది. బీజింగ్​ ఒలింపిక్స్​ ముగిసేలోపు రష్యా ఆ దేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ నుంచి తన బలగాలను, సిబ్బందిని అమెరికా తిరిగి రప్పించుకుంటోంది. రష్యా.. ఉక్రెయిన్​పై దాడి చేయనున్నట్లు వస్తున్న వార్తలను మాస్కో ఖండిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ ఉక్రెయిన్​పై దాడి గురించి మాత్రం రష్యా స్పష్టత ఇవ్వట్లేదు.


Also Read: Sansad TV Hacked: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్- సర్కార్‌ సంగతే ఇలా ఉంటే సామాన్యుడి గతేంటో!


Also Read: Fodder Scam Case: లాలూ మళ్లీ జైలు- ఆ కుంభకోణం కేసులో దోషిగా తేల్చిన కోర్టు