సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా ఎవరో అనధికారిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో సేవలను నిలిపివేశారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 1 గంట నుంచి ఈ ఛానల్ సేవలు నిలిచిపోయాయి. ఛానల్‌ను ఎవరో హ్యాక్ చేశారు. సంసద్ టీవీ పేరును 'ఎథెరియమ్‌'గా మార్చారు. సంసద్ టీవీ సోషల్ మీడియా టీమ్.. ఈ సమస్యను పరిష్కరించింది. ఉదయం 3.45 నిమిషాలకు తిరిగి ఛానల్ పనిచేసింది.                                    - సంసద్ టీవీ