UK PM Rishi Sunak: బ్రిటన్ ప్రధాని బాధ్యతలను రిషి సునక్ మంగళవారం చేపట్టారు. అయితే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో రిషి సునక్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు రిషి సునక్.
అనూహ్యంగా
ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ స్థానంలో రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెలన్నర క్రితం ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్ అతనిని ఓడించారు. అయితే 45 రోజులకే ఆర్థిక సంక్షోభం కారణంగా లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రధాని పదవి రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకోవడంతో రిషి సునక్ ఎన్నిక లాంఛనం అయింది.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునక్‌కు 144 మంది సభ్యుల మద్దతు లభించింది.
రిషి సునక్ ఎవరు?
రిషి సునక్.. ఇప్పటివరకు ఈయన బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతుల నిర్వర్తించారు. మనందరికీ సుపరిచితులైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి రిషి స్వయానా అల్లుడు. నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని సునక్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కృష్ణా సునక్, అనౌష్క సునక్ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్.. తీసుకున్న చర్యలకు మంచి పేరు వచ్చింది. ఆయన నిర్ణయాల వల్లే బ్రిటన్ ఆర్థికంగా కోలుకోగలిగిందని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఎన్నో సార్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం 10 బిలియన్ పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీని ప్రకటించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
Also Read: Priyanka Gandhi's Insta Post: 'ఇదంతా కేవలం ప్రేమ కోసమే చేశావ్'- ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్