న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 27


1. చీఫ్ ఎకనామిస్ట్: 01 పోస్టు

2. ప్రోటోకాల్ ఆఫీసర్: 02 పోస్టులు

3. డిప్యూటీ జనరల్ మేనేజర్ (స్కేల్-6): 01 పోస్టు


4. అసిస్టెంట్ మేనేజర్(స్కేల్-1)- జనరల్/ హిందీ: 16 పోస్టులు

5. సూపర్‌ విజన్ ఆఫీసర్స్: 06 పోస్టులు


6. రీజినల్ మేనేజర్ (స్కేల్-4)- కంపెనీ సెక్రటరీ: 01 పోస్టు


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.  బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:  పోస్టులవారీగా వయోపరిమితి నిర్ణయించారు. 01.10.2022 నాటికి నిర్ణీత వయసు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక ప్రక్రియ: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: రూ. 850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.



ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 18.11.2022.


* ఆన్‌లైన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022/ జనవరి 2023.




Notification


Website



 


ALSO READ


UPSC Recruitment 2022: కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల (చివరి తేదీ: 10.11.2022)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో భర్తీ చేయనుంది. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/ బీటెక్/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ‌స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ ​​నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు, ప్రారంభ జీతం రూ.56,100
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2023 ప్రారంభమయ్యే 23వ కోర్సులో సంబంధిత శాఖలు/ కేడర్/ స్పెషలైజేషన్లలో శిక్షణ ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


AP High Court Jobs: ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..