Twitter Layoffs: 


సేల్స్ విభాగంలో..


ట్విటర్‌లో లేఆఫ్‌లు ఇంకా కొనసాగే అవకాశాలున్నాయి. Bloomberg రిపోర్ట్ ప్రకారం..ఇవాళ్టి నుంచి మరి కొంత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సేల్స్ అండ్ పార్ట్‌నర్‌షిప్ విభాగంలోని ఉద్యోగులను తొలగించాలని మస్క్ భావిస్తున్నాడు. టెక్నికల్ విభాగంలో ఏ స్థాయి వ్యక్తులైతే ట్విటర్‌ను వీడాల్సి వచ్చిందో..సేల్స్ విభాగంలోనూ అదే స్థాయి వ్యక్తులు ఇప్పుడు ఇంటి బాట పట్టక తప్పేలా లేదని తెలుస్తోంది. ఇప్పటికే...ఎలన్ మస్క్ ఈ "ఫైరింగ్‌"కు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారట. మార్కెటింగ్
అండ్ సేల్స్ హెడ్ రాబిన్ వీలర్‌ను తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక పార్ట్‌నర్‌షిప్‌ విభాగానికి చెందిన హెడ్ మ్యాగీ సునీవిక్‌నూ తొలగిస్తున్నారట. ఇప్పటికే...ఈ విషయంపై మండి పడుతున్నారు ఈ ఇద్దరు సీనియర్ ఎంప్లాయిస్. నిజానికి..రాబిల్ వీలర్ గత నెలే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ...ఉద్యోగుల రిక్వెస్ట్‌తో ఆమె ఆ పని మానుకున్నారు. ట్విటర్ పాలసీ మార్పుల్లో కీలక పాత్ర పోషించారు రాబిన్. ఇప్పుడు ఎలన్ మస్క్ స్వయంగా ఆమెను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 8,500 మంది ఉద్యోగులను తొలగించాడు మస్క్. ప్రస్తుతానికి ట్విటర్‌లో 2-3 వేల మంది ఉద్యోగులు మాత్రమే మిగిలినట్టు సమాచారం. వీరితోనే కంపెనీని సమర్థంగా నడిపించాలని భావిస్తున్నాడు మస్క్. 


కొత్త పాలసీ..


ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశాడు. త్వరలోనే ట్విటర్‌లో కొత్త పాలసీ తీసుకొస్తున్నట్టు వెల్లడించాడు. విద్వేషపూరిత ట్వీట్‌లను నియంత్రించడం సహా...ఇప్పటి వరకూ బ్యాన్ అయిన అకౌంట్‌ల గురించీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. "కొత్త పాలసీ ఫ్రీడమ్ ఆఫ్ రీచ్‌కి కాకుండా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌కి ప్రాధాన్యతనిస్తుంది. విద్వేషపూరిత ట్వీట్‌లను ఏ మాత్రం ఉపేక్షించం. ట్విటర్‌కు రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప కొన్ని ట్వీట్‌లు ఎవరికీ కనిపించవు" అని వెల్లడించాడు. ఇక బ్లాక్ అయిన అకౌంట్‌లను పునరుద్ధరించే విషయాన్ని ప్రస్తావించాడు మస్క్. ఓ ముగ్గురి ప్రముఖల ట్విటర్ అకౌంట్‌లను పునరుద్ధరిస్తామని చెప్పిన మస్క్...ట్రంప్‌ అకౌంట్‌పై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. కమెడియన్ కాథీ గ్రిఫిన్‌ ఎలన్ మస్క్‌పై అప్పట్లో వ్యంగ్యంగా ట్వీట్‌లు చేశాడు. దీనిపై ఆగ్రహించిన ట్విటర్.. వెంటనే అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేశారు. దాదాపు 
22 నెలల తర్వాత ట్విట్టర్ లో మళ్లీ ట్రంప్ ఖాతా శనివారం కనిపించింది. గతేడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్ వద్ద హింసను ప్రేరేపించింనందుకు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేశారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించేందుకు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. 15 మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారులు ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ట్రంప్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి అనుకూలంగా 51.8 శాతం ఓట్లు వచ్చాయి. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్ ఎత్తివేసి, అకౌంట్ పునరుద్ధరించారు. 


Also Read: Budget 2023-24: 2023-24 బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ కసరత్తు, నిపుణులతో వరుస సమావేశాలు