Trucks Banned In Delhi:


సరిబేసి విధానం..?


నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఇక్కడి AQI 472గా ఉంది. ప్రస్తుతం అక్కడి వాయు నాణ్యతను "Severe"గా నిర్ధరించారు అధికారులు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యాంటీ పొల్యూషన్ ప్యానెల్‌ కట్టడి చర్యలు మొదలు పెట్టింది. CNG,ఎలక్ట్రిక్‌ ట్రక్‌లను తప్ప పెట్రోల్, డీజిల్‌తో నడిచే ట్రక్‌లు రోడ్లపైకి రాకుండా ఆంక్షలు విధించింది. కొన్ని ఇండస్ట్రీస్‌నీ మూసివేయించారు. BS-VI వాహనాలకు మినహాయింపునిచ్చింది. అత్యవసర సేవలకు వినియోగించే వాహనాలకూ మినహాయింపునిచ్చారు. పాఠశాలల్ని మూసి వేయాలా వద్దా అన్న నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ తేల్చి చెప్పింది. వాహనాల విషయంలో సరిబేసి విధానాన్నీ అమలు చేయాలని సూచించింది. నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అన్ని పాఠశాలలూ స్కూల్స్‌ మూసేశాయి. 8వ తరగతి వరకూ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నారు. నవంబర్ 8వ తేదీ వరకూ ఆన్‌లైన్ బోధననే కొనసాగించనున్నారు. ఈ కట్టడి చర్యలను ఇంకా కట్టుదిట్టం చేసేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. వర్క్ ఫ్రమ్‌ హోమ్‌కు ఇంకొన్ని రోజుల వరకూ అనుమతి ఇచ్చేలా రాష్ట్రం, కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముంది. 


గత 24 గంటల్లో ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ 450 గా నమోదైంది. "Severe Plus"గా అధికారులు వెల్లడించారు. అయితే...సరిబేసి విధానం విషయంలో ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇది అమలు చేస్తే..రోడ్లపైన వాహనాల రద్దీ చాలా వరకూ తగ్గుతుంది. తద్వారా కాలుష్యమూ తగ్గుతుంది. ఢిల్లీ కాలుష్యం అంశం..సుప్రీం కోర్టుకూ చేరింది. ఢిల్లీ-NCR ప్రాంతాల్లో కాలుష్య కట్టడికి అవసరమైన చర్యలు చేపట్టాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 10న విచారణకు అంగీకరించింది. 


రాజకీయ వేడి..


ఢిల్లీ కాలుష్యం..(Delhi Air Pollution) రాజకీయ వేడినీ పెంచుతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే దాని కంటే...ఎవరికి వాళ్లు పొలిటికల్ గెయిన్‌ కోసం చూస్తున్నారు. భాజపా, ఆప్ మధ్య ఇదో పెద్ద మాటల యుద్ధానికీ దారి తీసింది. పంజాబ్ రైతులకు కేంద్రం ఎలాంటి సహకారం అందించక పోవటం వల్లే గడ్డి తగల బెడుతున్నారని ఆప్ విమర్శిస్తుంటే...భాజపా లెక్కలతోసహా ఆప్ వైఫల్యాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్ వేదికగా ఆప్‌ను విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆప్ ప్రభుత్వం వచ్చాకే పంజాబ్‌లో గడ్డి తగలబెట్టడం ఎక్కువైందని, కాలుష్యం 19% పెరిగిందని మ్యాప్‌తో సహా పోస్ట్ చేశారు యాదవ్. ఢిల్లీ ఓ గ్యాస్ ఛాంబర్‌లా మారిపోయిందనటంలో ఎలాంటి సందేహం లేదని ట్వీట్ చేశారు. ఒక్కరోజులోనే పంజాబ్‌లో 3,634 ప్రాంతాల్లో రైతులు గడ్డి కాల్చారని వివరించారు. గతేడాదితో పోల్చి చూస్తే...ఇప్పుడే పంజాబ్‌లో ఈ సమస్య తీవ్రమైందనీ ఆరోపించారు. 


Also Read: Gujarat Elections 2022: ఆపరేషన్ గుజరాత్‌లో బిజీబిజీగా పార్టీలు, ఎవరి వ్యూహాలు వాళ్లవి