Tripura News: శాలరీ అడిగితే చంపేస్తారా? ఇనుప రాడ్డు, బెల్టుతో దాడి!

ABP Desam   |  Murali Krishna  |  09 Nov 2022 04:34 PM (IST)

Tripura News: జీతం అడిగినందుకు ఓ వ్యక్తిని యజమాని ఇనుప రాడ్డుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tripura News: శాలరీ అడిగితే చంపేస్తారా? ఇనుప రాడ్డు, బెల్టుతో దాడి!

(Image Source: Twitter)

Tripura News: చేసిన పనికి జీతం అడిగినందుకు ఓ వ్యక్తిపై యజమాని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇనుప రాడ్డు, బెల్టుతో అతనిపై తీవ్రంగా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది

త్రిపురలో ఈ ఘటన జరిగింది. అగర్తలాలో సూరజిత్ త్రిపుర అనే వ్యక్తి ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఆ షాపు యజమాని సాహా గత అక్టోబర్‌కు సంబంధించి సూరజిత్‌కు జీతం ఇవ్వలేదు. దీంతో తనకు పెండింగ్‌ శాలరీ ఇవ్వాలని సూరజిత్‌ డిమాండ్ చేశాడు. ఇది విన్న యజమాని సాహా అక్కడే పని చేసే మరో వ్యక్తి సాయంతో సూరజిత్‌పై ఇనుప రాడ్‌, బెల్టుతో దాడి చేశాడు. చెంపదెబ్బలు కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాధితుడు సూరజిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ వీడియోను ట్రైబల్‌ పార్టీ టిప్రా మోతా చీఫ్‌ ప్రద్యోత్‌ మానిక్యా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

త్రిపుర పోలీసులకు విజ్ఞప్తి! ఇప్పటికే ఈ విషయాన్ని మీతో చర్చించాం! మేము న్యాయం కోరుతున్నాం! ఎవరినైనా ఇలా ట్రీట్‌ చేస్తే నా గుండె పగిలిపోతుంది! దయచేసి ఈ ఘటనపై చర్యలు తీసుకోండి లేదా నేను వ్యక్తిగతంగా నా YTF యోధులతో మీ స్టేషన్‌కి వస్తాను!                   - ప్రద్యోత్, ట్రైబల్ పార్టీ టిప్రా మోతా చీఫ్

Also Read: Viral News: ఇదో రొమాంటిక్ ప్రేమ కథ- కారు 'గేర్' మార్చే స్టైల్ చూసి పడిపోయిందట!

Published at: 09 Nov 2022 04:31 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.