Training aircraft goes missing after take-off from Jamshedpur : హైదరాబాద్‌లో రోజూ సాయంత్రం పూట.. చాలా తక్కువ ఎత్తులో విమానాలు ఎగురుతూ ఉంటాయి. అవి ప్యాసింజర్ విమానాలు కాదని.. అక్కడక్కడ చక్కర్లు కొడుతూండటం చూసి అందరికీ అర్థమవుతుంది. అవి ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లు. ఇలాంటి ఓ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ శిక్షణ కోసం గాల్లోకి లేచిన కాసేపటికే కనిపించకుండా పోయిన ఘటన జార్ఖండ్‌లోని జంషేడ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
పైలట్ శిక్షణా కేంద్రం నుంచి గాల్లోకి ఎగిరిన విమానం
జార్ఖండ్‌లోని సెరైకేలా-ఖార్సవాన్ జిల్లాలో పైలెట్ల శిక్షణా కేంద్రం ఉంది. పలువురు ఔత్సాహిక పైలట్లకు ఇక్కడ శిక్షణ ఇస్తూంటారు. ఇందు కోసం రెండు సీట్ల ఎయిర్ క్రాఫ్ట్‌లను ఎక్కువగా వినియోగిస్తూంటారు. ఇలా శిక్షణ కోసం గాల్లోకి లేచిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత సేపయినా తిరిగి రాలేదు. గాల్లోకి లేచిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాంతో మిస్ అయినట్లుగా గుర్తించి వెంటనే వెదుకులాట ప్రారంభించారు.
డీఎంకే బీజేపీకి దగ్గరవుతోందా ? తమిళనాట రాజకీయాల్లో మార్పులు దేనికి సంకేతం ?
సమీపంలోనే డ్యామ్, దట్టమైన అడవి
ఆ సమీపంలో పెద్ద డ్యామ్ తో పాటు అటవీ ప్రాంతం ఉండటంతో.. శిక్షణా విమానం ఎక్కడైనా కూలిపోయిందా అన్న దానిపై సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకూ విమానం ఆచూకీ తెలియలేదు. అసలు ఎటు వైపు వెళ్లిందో కూడా గుర్తించలేకపోతోంది. ఎక్కైనా సురక్షితంగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ దిగే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్కడో ఓ చోట క్రాష్ ల్యాండింగ్ అయి ఉటుందని భావిస్తున్నారు.
డ్యామ్‌లో విమాన శకలాలు ఉన్నాయని గ్రామస్తుల సమాచారం
సమీపంలోని ఉన్న డ్యాం వద్ద విమాన శకలాలు చూశామని కొంత మంది ఆ చుట్టుపక్కల గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో డ్యామ్‌లో ఏమైనా కూలిపోయిందా అన్న దిశగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ఫలితం లభించలేదు. కనిపించకుండా పోయిన ఎయిర్ క్రాఫ్ట్.. కఅల్ కెమిస్ట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన సెస్నా 152గా భావిస్తున్నారు. ఇది కూలిపోయినా.. పైలట్, కో పైలట్ బయట పడేందుకు అవసరమైన రక్షణ సౌకర్యాలు ఉంటాయని అంటున్నారు.
మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స, లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా
పైలట్, కో పైలట్ సేఫ్ ఉంటారని అన్వేషణ
విమానం ఎక్కడైనా కూలిపోయినా శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన పైలట్.. శిక్షణ తీసుకుంటున్న పైలట్ సురక్షింతగా ఉంటారని భావించి విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరన్నదానిపై ఎలాంటి వివరాలను ఇంకా బ యట పెట్టలేదు.