Traffic Fines in India Cross Rs 12000 Crore: భారతదేశంలో ట్రాఫిక్ ఫైన్లు మితిమీరిపోతున్నాయి. 2024 లో మాత్రమే దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లు జారీ చేశారు. దీని అర్థం ప్రతి రెండు వాహనాల్లో ఒక దానికి ఫైన్ వేశారు. ఈ ఫైన్ల మొత్తం విలువ రూ.12 వేల కోట్ల రూపాయలు. చిన్న రాష్ట్రాల జీడీపీ కంటే ఎక్కువ.
భారతదేశంలోని 140 కోట్ల జనాభాలో కేవలం 11 కోట్ల మంది మాత్రమే వాహనాలను కలిగి ఉన్నారని ఓ ఆటోమెబైల్ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. అలాగే ప్రతి రెండవ వాహనానికి కనీసం ఒక్కసారైనా జరిమానా విధించారు. ట్రాఫిక్ క్రమశిక్షణ ను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదన్న విషయం ఈ ఫైన్ల ద్వారా స్పష్టమవుతోదంది. నియమాలను పాటించాల్సిన అవసరం లేదన్న మనస్తత్వం ప్రమాదకరమైనది.
అయితే పోలీసులు ఉన్నారా లేరా అన్న దానితో సంబంధం లేకుండా తాము ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నామని ఈ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో 43.9% మంది డ్రైవర్లు చెప్పారు. 31.2% మంది సమీపంలో పోలీసులు ఉన్నారని అనుమానించినప్పుడు మాత్రమే ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నారు. 17.6% మంది జరిమానాలను తప్పించుకోవడానికి తమ పరిసరాలకు తగ్గట్లుగా డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సర్వే చాలా మంది భారతీయ డ్రైవర్లకు, పోలీసు కనిపించకపోతే ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని అనుకుంటారని వెలుగులోకి తెచ్చింది.
డ్రైవర్లు విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులను గుర్తించినప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు. సగానికి పైగా (51.3%) వాహనదారులు తమ వాహన వేగానని తగ్గించుకుని, నియమాలను పాటిస్తున్నారు. మరో 34.6% మంది ఎటువంటి చట్టాలను ఉల్లంఘించరు. కానీ పోలీసుల్ని చూసి మెల్లగా వెళ్తారు. 12.9% మంది తమ డ్రైవింగ్ సరళిని మార్చుకున్నట్లు , పట్టుబడకుండా ఉండటానికి వేరే దారిలో వెళ్లడం వంటివి చేస్తారు.
నిఘా కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రిస్తాయని భావించినప్పటికీ, మిశ్రమ ఫలితాలను ఇస్తున్నట్లుగా సర్వేలో తేలింది. 47 శాతం మంది కెమెరా ఉనికితో సంబంధం లేకుండా తాము స్థిరంగా డ్రైవ్ చేస్తున్నామని చెప్పారు. 36.8 శాతం మంది కెమెరాను చూసినప్పుడు మాత్రమే నెమ్మదిస్తారని చెప్పారు. ఆసక్తికరంగా, 15.3 శాతం మంది స్పీడ్ కెమెరాలకు మాత్రమే భయపడుతున్నారు. 2022లో ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా 1,68,491 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే పన్నెండు వేల కోట్ల జరిమానా సాంకేతికంగా జరిమానాలు విధించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంలో ఎలా మాస్టర్లు అవుతారో.. ఈ జరిమానాల చెల్లింపులోనూ అలాగే తప్పించుకుంటున్నారు. దాదాపు రూ. 9,000 కోట్ల విలువైన జరిమానాలు చెల్లించడం లేదు. తప్పని సరి పరిస్థితుల్లోనే చెల్లిస్తున్నారు