Asia Cup India: ఈ ఏడాది భారత్ లో జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నీ సందిగ్ధంలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ టోర్నీని బహిష్కరించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి నిర్ణయం ఏదీ ఇంకా తీసుకోలేదని బీసీసీఐ చెబుతోంది.
ఆసియా కప్ ఈ ఏడాది ఇండియాలో జరగాల్సి ఉంది. చాలా కాలం నుంచి భారత్, పాకిస్తాన్ లు ముఖాముఖి పర్యటనలు చేయడం లేదు. భారత్ పాకిస్తాన్ కు పోవడం లేదు. పాకిస్తాన్ ఆటగాళ్లు భారత్ కు రావడం లేదు. అయితే ఇటీవల చాంపియన్స్ ట్రోఫిలో తటస్థ వేదికలపై భారత్ పోటీ పడింది. ఇండియా పాక్ మ్యాచ్ కూడా తటస్థ వేదికపైనే జరిగింది. ఈ క్రమంలో ఆసియా కప్ లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది.
ఆసియా కప్ లో పాల్గొనేందుకు పాకిస్తాన్ రావడం అసాధ్యం. అయితే అసలు ఆసియాకప్ నిర్వహణకే భారత్ సుముఖంగా లేదన్న ప్రచారం ఊపందుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య రాజకీయ , సైనిక ఉద్రిక్తతల కారణంగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్‌లో పాల్గొనకూడదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కు తెలియజేసినట్లు ప్రచారం ఊపందుకుంది కానీ క్లారిటీ లేదు.
ఆసియా కప్ 2025 సెప్టెంబర్‌లో T20 ఫార్మాట్‌లో జరగాల్సి ఉంది. దీనికి భారత్ ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాక్ టీం రాదు కాబట్టి తటస్థ వేదికలో నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. BCCI ఈ టోర్నమెంట్‌ను హోస్ట్ చేయడం లేదా ఆడడం ఇప్పటి పరిస్థితుల్లో మంచిది కాదని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్ మినిస్టర్ , పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ ఉన్నారు.
భారత్ ఒక వేళ ఆసియా కప్ లో ఆడకూడదని. ఆతిధ్యం ఇవ్వకూడనది నిర్ణయం వల్ల టోర్నమెంట్ రద్దయ్యే అవకాశం ఉంది. భారత్ లేకుండా ఆసియా కప్ ఆర్థికంగా లాభదాయకం కాదు. భారత స్పాన్సర్లు , బ్రాడ్‌కాస్టర్లు టోర్నమెంట్ కు ప్రధాన ఆదాయన వనరులు. భారత్ లేకపోతే వారు వెనక్కి తగ్గుతారు.
అయితే, BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా ఆసియా కప్ గురించి ఎలాంటి చర్చ లేదా నిర్ణయం జరగలేదని, ఈ వార్తలు “ఊహాజనితమైనవి” అని చెప్పారు. BCCI అధికారికంగా ఈ నిర్ణయాన్ని ధృవీకరించలేదు, కానీ ACC సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. భారత్ లేకుండా టోర్నమెంట్ జరగడం కష్టమని, రద్దయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.