Telugu News Today: Mahalaxmi Scheme: రూ.500కే గ్యాస్ సిలిండర్ - తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
రాష్ట్రంలో అర్హులైన వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మరో కీలక అడుగు పడింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంపై ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో రేషన్ కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీ సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


'ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటు' - హనుమవిహారికి అండగా ఉంటామన్న చంద్రబాబు
రాష్ట్రంలో వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. క్రికెటర్ హనుమవిహారి (Hanuma Vihari) విషయంపై మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి.. ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు. హనుమవిహారికి తాము అండగా ఉండి అతనికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


Bandla Ganesh on Roja : రోజా డైమండ్ రాణి, పులుసు పాప - రోజాపై బండ్ల గణేష్ విమర్శలు
ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాలపై సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి అని ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్ అన్నారు. రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదని.. సీఎం జగనే యాక్సిడెంటల్ సీఎం అన్నారు. రేవంత్ రెడ్డి పోరాటం చేసిన యోధుడు, ఫైటర్ అన్నారు. భారతదేశంలో రేవంత్ రెడ్డిలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. పోరాడి, కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారన్నారు. నాన్న చనిపోతేనే, నాన్న వారసత్వంతోనే సీఎం అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారన్నారు.   పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


హుస్నాబాద్‌లో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత - కాంగ్రెస్ , బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ !
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కరీంగర్ ఎంపీ చేపట్టిన  ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తలకు దారి తీసింది.  ప్రజాహిత యాత్రపై దాడికి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు.  కర్రలు పట్టుకుని ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  కాంగ్రెస్ కార్యకర్తలల తీరుపై కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి.  కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా పోలీసులు నిలువరించారు.  కాంగ్రెస్ నేతలు కర్రలతో వస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హిందూపురం ఎంపీ సీటు బీజేపీకేనా ? - పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్న విష్ణువర్ధన్ రెడ్డి !
ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫైనల్‌కు వస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరనుందని.. ఎక్కువగా ఎంపీ సీట్లలో పోటీ చేయనుందన్న ప్రచారం జరుగుతోంది. అంతర్గతంగా దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా రెడీ అయ్యాయని అంటున్నారు. హిందూపురం ఎంపీ సీటును బీజేపీకి కేటాయిస్తారని అంటున్నారు. అక్కడ పోటీ చేసేందుకు ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికుడినైన తనకు హిందూపురం ఎంపీ టీక్కెట్ కేటాయించాలని  హైకమాండ్ ను కోరుతున్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి