Telugu News Today: 'కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం' - కుప్పానికే నీళ్లవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సీఎం జగన్ విమర్శలు
కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామని.. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. సోమవారం హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన ఆయన.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేశారు. కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. '672 కిలోమీటర్లు దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎంపై కామెంట్స్‌ చేసిన రమణ దీక్షీతులపై టీటీడీ చర్యలు- గౌరవ ప్రధాన అర్చకుడు ఉద్యోగం నుంచి తొలగింపు
సీఎం జగన్‌తోపాటు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై తిరుమల దేవస్థానం చర్యలు తీసుకుంది. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయించింది. అన్నమయ్య భవన్‌లో సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో రమణ దీక్షితులపై చర్యలు కూడా ఉన్నాయి. వారం రోజుల క్రితం రమణ దీక్షితులు సీఎం జగన్, టీటీడీ అధికారులు, అహోబిలం మఠం, జీయర్‌లపై చేసిన కామెంట్స్‌ సంచలనం రేపాయి.   పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత - బీజేపీ నేత కుమారుడు అరెస్ట్?
హైదరాబాద్ పోలీసులు నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ లో ఆదివారం రాత్రి ఓ బీజేపీ నేత కుమారుడు కొందరికి విందు ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి.. హోటల్ లో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సదరు బీజేపీ నేత కుమారుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పట్టుబడిన వారిలో మాజీ సీఎం రోశయ్య మనవడు సైతం ఉన్నట్లు సమాచారం.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


టికెట్ రాకపోవడంపై బుద్దవెంకన్న సంచలన వ్యాఖ్యలు
విజయవాడ టికెట్ ఆశించి భంగపడ్డ బుద్దా వెంకన్న ఇన్ని రోజుల తర్వాత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు తనకు దైవ సమానులని అన్నారు. తాను టికెట్ ఆశించానని.. అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. టిడిపిలో అయారాం, గయారాంలు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ ఇస్తే పొగుడుతారు, లేదంటే దిష్టిబొమ్మ తగల‌ పెడతారని విమర్శించారు. తాను మాత్రం చంద్రబాబుకు ఆంజనేయుడి వంటి‌ వాడినన్నారు. చంద్రబాబును అభ్యర్దించాలే కానీ డిమాండ్ చేయకూడదని సూచించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీబీఐ విచారణకు హాజరు కాలేను - లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఫిబ్రవరి 26న (సోమవారం) విచారణకు తాను హాజరు కాలేనంటూ సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) లేఖ రాశారు. సీబీఐకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ (CRPC Sec 41A) కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐ(CBI)ని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి