Telugu News Today: ష‌ర్మిల దూకుడు.. సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు లేఖాస్త్రాలు.. విష‌యం ఏంటంటే!
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌దేశ్  కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) దూకుడు పెంచారు. గ‌త నెల‌లో పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆమె.. ఒక‌వైపు పార్టీని ప‌రుగులు పెట్టించ‌డంతోపాటు, మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల పార్ల‌మెంటు(Parliament) బ‌డ్జెట్ స‌మావేశాల స‌మ‌యంలో రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా స‌హా పోల‌వ‌రం, క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మాణం, విశాఖ రైల్వే జోన్‌, వెనుక‌బ‌డిన సీమ‌, ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు నిధుల అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌ధానికి లేఖ రాశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  


బీఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్‌ సభ-పార్లమెంట్‌ ఎన్నికల ముందు పొలిటికల్‌ ఫైట్‌
పార్లమెంట్‌ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ఈనెల 13న నల్గొండ (Nalgonda)లో బీఆర్‌ఎస్‌ (BRS) భారీ బహిరంగ నిర్వహిస్తున్న ప్రకటించింది. ఆ సభలో కృష్ణా జలాలకు సంబంధించి అన్ని విషయాలను ప్రజలకు  వివరిస్తామని చెప్పారు మాజీ సీఎం కేసీఆర్‌ (KCR). నిన్న(ఫిబ్రవరి 6వ తేదీ) తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో దక్షిణ తెలంగాణ నేతలతో సమావేశమైన కేసీఆర్‌... ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో ప్రాజెక్టుల (Projects)ను అప్పగించాలని కేంద్రం నుంచి ఎంతో ఒత్తిడి  వచ్చిందని.. అయినా తలొగ్గలేదన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో అసలు బలం లేని బీజేపీ కోసం ఆరాటం - టీడీపీ, జనసేన ఏం కోరుకుంటున్నాయి ?
ఏపీలో ఇప్పుడు రాజకీయ పొత్తులపై చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన పొత్తులు ఫైనల్ చేసుకున్నాయి. సీట్ల సర్దుబాటుపై కూడా ఓ అంచనాకు వచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తులు ఫైనల్ చేసుకునేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారన్న  ప్రచారం ప్రారంభమయింది. అయితే ఇదే మొదటి సారి కాదు. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరుతుందని గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది.   టీడీపీ అధినేత చంద్రబాబు మోదీ విధానాలను సమర్థిస్తానని  ఇటీవలి కాలంలో చాలా సార్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రేవంత్ రెడ్డి సంయమనం 2 నెలలేనా ? అప్పుడే ఆవేశ పడుతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అలాంటి కక్ష సాధింపులకు ఇంకా పాల్పడలేదు. అలాంటివేమీ ఉండవని ఆయన చెప్పారు. రెండు నెలలపాటు అలాగే పరిపాలనచేశారు.  కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో రెండు నెలలలోపే ఎన్నో అంతర్గత సమస్యలు ఎదుర్కొంంది. అక్కడ కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువ. తెలంగాణలో కూడా అదే పరిస్థితి.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హైదరాబాద్‌లో ఆర్టీసీలో మహిళలే కాదు మగవాళ్లు కూడా ఇలా ఉచితంగా జర్నీ చేయవచ్చు
తెలంగాణలో మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ప్రభుత్వం. దీంతో మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. నిత్యం బస్సులు కళకళలాడుతున్నాయి. రద్దీ కూడా ఊహించినదాని కంటే ఎక్కువగా ఉంది. దీనిపై సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళా ప్రయాణికులు కారణంగా పురుషులు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ప్రత్యేక బస్‌లు వేయాలన్న డిమాండ్ ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి