Top News Today:  అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
వైసీపీ సీనియర్ లీడర్‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. బాలికపై అత్యాచారం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై దాడి జరిగింది. వెంటనే ఆమెపై అత్యాచారం జరిగిందని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తప్పుడు ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై కూడా పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
తెలంగాణలో సమీపంలో ఎన్నికలు లేవు. మరో నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి. కేంద్రం జమిలీ ఎన్నికలు ఆలోచన చేస్తే.. మరో ఐదారు నెలలు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలను లోక్ సభతోనే కలుపుతుంది కానీ ముందే నిర్వహించరు. అయినా రాజకీయాలు మాత్రం వేడి తగ్గడం లేదు. పోటాపోటీగా అధికార విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. తాజాగా సెంటిమెంట్ రాజకీయాలు కూడా ప్రారంభించాయి. పూర్తి వివరాలు


ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్- డిసెంబర్ 20న పోలింగ్ 
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నిక నగారా మోగింది. వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ముగ్గురు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్‌, ఆర్‌ కృష్ణయ్య రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇలా ఖాళీ అయిన స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల సంఘం డిసెంబల్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనుంది. డిసెంబర్ 10 వరకు నామినేషన్లకు స్వీకరిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి డిసెంబర్‌ 13 వరకు గడువు విధించింది. పూర్తి వివరాలు


రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కవిత! ఆ వర్గాల టార్గెట్‌గానే రాజకీయం చేస్తారా?
రాజకీయాలు పూల బాట మాత్రమే కాదు. ముళ్ల బాట కూడా. అధికారంలోకి రావాలంటే చెమటోడ్చాల్సిందే. ఎత్తుకు పైఎత్తులు వేయాల్సిందే. వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నాలి. ఎదురు దెబ్బ తగిలితే సమయం కోసం వేచి చూడాలి. గెలుపు కోసం ఎత్తు పల్లాలు దాటాలి, కష్టనష్టాలు అనుభవించాలి. చదరంగంలో పావులు కోల్పోయినంత మాత్రాన ఓటమి కాదు. పావులు ఉన్నంత మాత్రాన గెలుపు కాదు. చివరి వరకు ఎవరు పోరాటం చేస్తారో వారే విజేత. పూర్తి వివరాలు 


తిరుమల లడ్డూ వివాదంపై రంగంలోకి దిగిన సీబీఐ- ఎక్కడెక్కడ విచారణ చేస్తోంది అంటే?
తిరుమల శ్రీవారి ప్రసాదంలో అతి ప్రీతికరమైన లడ్డూ ప్రసాదం వివాదం పెద్ద దుమారమే రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనతో పెద్ద వివాదానికి దారి తీసింది. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనతో ఈ అంశం నేషనల్ మీడియాలో నిలిచింది. చాల సున్నితమైన అంశం... పైగా కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సైతం సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు