Telangana News Today |  తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డిప్యూటీ సీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు 
కేంద్ర ప్రభుత్వ విధానాలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఫైర్ అయింది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ల భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యారీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టారు. పూర్తి వివరాలు


జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
ఏపీలో అతి బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు సామాజిక వర్గం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని వదిలి పెడుతోందా..? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ మధ్య ఒకేసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. 2024 ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందిన తర్వాత కాపు సామాజిక వర్గ నేతలు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ముందుగా కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేస్తే ఆ తర్వాత జగన్‌కు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న ఆళ్లనాని కూడా పార్టీకి రాజీనామా చేశారు.  పూర్తి వివరాలు 


ఐపీఎస్‌ పెళ్లిలో కాంగ్రెస్ జెండా వివాదం- సినిమాటిక్ ట్విస్టులతో సాగిన వివాహం
ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఐపీఎస్ పెళ్లిలో వివాదం చోటు చేసుకుంది. పార్టీ జెండాలు ఉన్నాయని పెళ్లికి ఆటంకం ఏర్పడింది. విషయం నిరసనల వరకు వెళ్లింది. అనేక ట్విస్ట్‌లతో మొత్తానికి కథ సుఖాంతమైంది.  గుంటూరు నగరంలో ఓ ఐపీఎస్ వివాహం వివాదాస్పదమైంది. తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత కుమార్తెతో వివాహం నిశ్చమైంది. పెళ్లి కోసం గుంటూరులోనే ధూమ్‌ధామ్‌గా ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడే ఓ వివాదం చెలరేగింది.  పూర్తి వివరాలు


తెలంగాణలో అసెంబ్లీలో భూభారతి బిల్లు- దోచుకున్న భూములు స్వాధీనం చేసుకుంటామని మంత్రి హెచ్చరిక
తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టం-2020ను పూర్తిగా ప్రక్షాళన చేసిన ప్రభుతవం కొత్తగా భూభారతి బిల్లును తీసుకొచ్చింది. అనేక రోజులు పరిశోధనల తర్వాత దీన్ని రూపొందించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభలో ప్రకటించారు. ఈ బిల్లు ఏర్పాటుకు ప్రతిపక్షాలు కూడా సలహాలు సూచలు చేశాయని గుర్తు చేశారు. ఈ బిల్లుతో తెలంగాణలోని ప్రతి ఇంచు భూమికి రక్షణ దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు


టీడీపీ క్యాడర్ ఆన్ ఫైర్ - మంత్రి పార్థసారధి అర్థం చేసుకోలేకపోయారా ?
ఏపీ మంత్రి పార్థసారధి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆదివారం రోజు తన నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమలో ఆయనతో పాటు జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించారు. సభా వేదిక మీద ఇతర నేతల్ని తక్కువ చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జోగి రమేష్ పొగిడారు.  పూర్తి వివరాలు