మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ అనారోగ్యంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది . చత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ -బస్తర్ అడవుల్లో ప్రస్తుతం షెల్టర్ పొందుతున్న ఆయన అక్కడే చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ ధృవీకరించలేదు. కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు మీడియాకు ఈ సమాచారాన్ని లీక్ చేసినట్లుగా భావిస్తున్నారు.
Also Read : ఏపీలో బొగ్గు కొరతపై జగన్ రివ్యూ.. కరెంటు కోతలు ఉండొద్దని ఆదేశాలు మావోయిస్టు పార్టీలో ఆర్కే అత్యంత సీనియర్ నేత. దాదాపు ౩౦ఏళ్లపాటు ఆయన ఉద్యమంలో కొనసాగారు. మావోయిస్టు పార్టీకి సుదీర్ఘకాలం సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన గణపతి తర్వాత ఆ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న నేత ఆర్కే..! ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమ్రకోట. విద్యార్థి దశలోనే విప్లవోద్యమం వైపు వెళ్లారు. పీపుల్స్‌వార్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా చాలాకాలం పనిచేశారు. మావోయిస్టుపార్టీ సైద్దాంతిక వ్యూహకర్తల్లో ఒకరిగా ఉన్న ఆర్కే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పీపల్స్ వార్, జనశక్తి నక్సల్స్ తో సాగించిన చర్చల్లో నక్సల్స్ బృందానికి నేతృత్వం వహించారు. 2004 అక్టోబర్ 14న ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ సందర్భంగానే ఆయన అడవి నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. సరిగ్గా 17ఏళ్ల తర్వాత అదేరోజు ఆయన చనిపోయినట్లు బయటకు వచ్చింది. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఆర్కే తలపై రూ.50 లక్షల రివార్డు కూడా ఉంది. ఆర్కేని లక్ష్యంగా చేసుకుని ఎన్నో సార్లు ప్రత్యేక బలగాలు ఆపరేషన్లు నిర్వహించాయి. కానీ ఎప్పుడూ సక్సెస్ కాలేకపోయారు.
నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో ఉన్న ఆర్కే అనేక సార్లు పోలీసు తూటాల నుంచి తప్పించుకున్నారు. భారీ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతీసారి ఆర్కే చనిపోయారనే ప్రచారం జరిగేది. 2016 లో రామన్నగూడలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ౩౦ మంది మావోయిస్టులు చనిపోాయారు. ఆ సమయంలో ఆర్కే అక్కడే ఉన్నారు. 2018లో ఏవోబీలోని బలిమెలలో జరిగిన ఎదురు కాల్పుల్లోనూ ఆయన చనిపోయినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది. అయితే అప్పుడు ఆయనకు బుల్లెట్ గాయాలయ్యాయన్న ప్రచారం జరిగింది. నిజంగానే బుల్లెట్ గాయాలయ్యాయో.. లేకపోతే వయసు మీద పడిన కారణంగా అనారోగ్యం పాలయ్యారో కానీ.. ఇటీవలి కాలంలో ఆయన యాక్టివ్‌గా లేరు. అయితే ఆ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కుమారుడు మున్నా చనిపోయారు.
Also Read: Revanth Reddy: డీఎస్‌ను కలిసిన రేవంత్.. ఆయన ఇంటికెళ్లి భేటీ, కారణం ఏంటంటే..
ఇటీవలి కాలంలో మావోయిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పోలీసు కాల్పుల్లో చపోయేవారు కాకుండా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయే వారు ఎక్కువగా ఉన్నారు. కొంత మంది ముఖ్యనేతలు చనిపోయినా బయటకు రానివ్వలేదు. ఆర్కే విషయంలో కూడా మావోయిస్టులు గుంభనంగా ఉంటున్నారు. కొన్ని రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించే దృశ్యాలను విడుదల చేసి..అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Also Read : ఏపీలో ముందుంది కోతల కాలం .. కరెంట్ జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సలహా !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి