Top Headlines Today: 


తొలిసారి తెలంగాణలో ప్రియాంక పర్యటన


ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. యువ సంఘర్షణ పేరుతో సరూర్‌నగర్‌లో జరిగే నిరుద్యో నిరసన ర్యాలీలో ఆమె పాల్గొంటున్నారు. సాయంత్రం 3.30కి బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎల్బీనగర్ చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారీ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి సరూర్‌నగర్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ యువసంఘర్షణ సభలో ప్రసంగిస్తారు. ఇటీవల కాలంలో చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందజేస్తారు. 


అమరావతి ఆర్‌5 జోన్‌పై సుప్రీంలో విచారణ


ఆర్‌5 జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రైతులు తమ పిటిషన్లలో కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. 


కర్ణాటకలో నేటి సాయంత్రం నుంచి మైక్‌లు బంద్


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుండి. ఇప్పటికే కన్నడలో విజయం కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అగ్రనేతలంతా రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా తమకే ఓటు వేయాలని ప్రజలకు విన్నవించుకుంటున్నారు. కింది స్థాయి లీడర్లు ఇంటింటికీ తిరుగుతూ గెలుపు సొంత చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉన్నప్పటికీ ఎలాగైనా మరోసారి కింగ్ మేకర్‌గా ఉండాలని జేడీఎస్‌ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అధినేత దేవెగౌడ ప్రచారానికి దూరంగా ఉంటున్నా.. కుమారుడే అన్నీ తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. 


బీజేపీపై ముఖ్యంగా సీఎం బసవరాజ్‌ బొమ్మైపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు పీఠం ఖాయమనే సంకేతాలు సీఓటర్‌ సర్వేలో తేలింది. బీజేపీ రెండో స్థానంలో ఉంటుందని... జేడీఎస్‌ మూడో స్థానానికి పరిమితం అవుతుందని కూడా సర్వేలో స్పష్టమైంది. ఈ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని బీజేపీ చాలా మార్పుు చేసింది. 10న జరిగే పోలింగ్‌లో ప్రజలు ఏ పార్టీ మొగ్గుతారో చూడాలి. 


మణిపూర్‌పై సుప్రీంలో విచారణ


ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ప్రస్తుతానికి ఆగేలా కనిపించడం లేదు. ఇదిలావుండగా, సోమవారం సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిపై ఇది ప్రభావం చూపుతుందని అందరూ భావిస్తున్నారు. మణిపూర్ లో పరిస్థితి మెరుగవుతోందని, హింసకు గురైన వారిని వివిధ సహాయ శిబిరాల్లో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. శాంతి పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలన్నీ ప్రస్తుతం పట్టాలెక్కడం ఊరట కలిగించే అంశమే.


కృష్ణయ్య భార్య ఉమాదేవి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 


బీహార్  IAS జి. కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. బీహార్ ప్రభుత్వం చేసిన జైలు నిబంధనల్లో మార్పుల కారణంగా ఆనంద్ మోహన్ ముందుగానే విడుదలయ్యారు. బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ కృష్ణయ్య భార్య ఉమాదేవి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీహార్ ప్రభుత్వం నిబంధనలను మార్చి గురువారం (ఏప్రిల్ 27) ఉదయం 6.15 గంటలకు సహర్సా జైలు నుంచి ఆనంద్ మోహన్ సింగ్ ను విడుదల చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ కృష్ణయ్య కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.


నేడు ఐపీఎల్‌లో


ఇవాళ్టి ఐపీఎల్‌ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్‌ తలపడనుంది. ఈడెన్ గార్డెన్ వేదిగా ఈ మ్యాచ్ జరగనుంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: శ్రీరామ్ ఫైనాన్స్‌లో 375 కోట్ల రూపాయల ఈక్విటీ పెట్టుబడి కారణంగా పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 196 కోట్ల నష్టాల్లోకి జారిపోయింది, గత ఏడాది ఇదే కాలంలో 151 కోట్ల లాభం నమోదు చేసింది.


ఓలెక్ట్రా గ్రీన్‌టెక్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 27 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 52% పెరిగింది. ఏకీకృత ఆదాయం Q4FY22లోని రూ. 271 కోట్ల నుంచి Q4FY23లో 39% పెరిగి రూ. 376 కోట్లకు చేరుకుంది.









ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: నాలుగో త్రైమాసికంలో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నికర లాభం 58% జంప్ చేసి రూ. 190 కోట్లకు చేరుకుంది. వ్యాపార విస్తరణ, ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉంది. స్థూల అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 35% పెరిగి రూ. 27,861 కోట్లకు చేరుకున్నాయి.


Paytm: రెండు వరుస త్రైమాసికాల్లో నిర్వహణ లాభాన్ని (ESOP వ్యయానికి ముందు EBITDA) పోస్ట్ చేసింది. 2023 మార్చి త్రైమాసికంలో నష్టాలను గణనీయంగా తగ్గించింది. కంపెనీ ఏకీకృత నికర నష్టం ఏడాది క్రితం నాటి రూ. 761 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 168 కోట్లకు తగ్గింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇది రూ. 392 కోట్లుగా ఉంది. FY23 మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం దాదాపు 52% YoY పెరిగి రూ. 2,335 కోట్లకు చేరుకుంది.


అదానీ పవర్‌: ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అదానీ పవర్ ఏకీకృత నికర లాభం ఏడాది క్రితం నాటి రూ. 4,645 కోట్లతో పోలిస్తే రూ. 5,242.48 కోట్లకు, 12.9% పెరిగింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ. 4911.5 కోట్ల నుంచి రెండింతలు పెరిగి రూ. 10726 కోట్లకు చేరుకుంది. నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 10,795 కోట్లుగా ఉంది, ఇది అంతకు ముందు త్రైమాసికంలో రూ. 13,308 కోట్లుగా ఉంది.


ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్‌ రిటైల్: TCNS క్లోతింగ్‌లో 51% వాటాను ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ABFRL) కొనుగోలు చేసింది. మరో 29% వాటా కొనుగోలు కోసం ఒక్కో షేరుక్ రూ. 503 చొప్పున ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది.


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2022 మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ ఆర్జించిన రూ. 1,557 కోట్ల లాభంతో పోలిస్తే, 2023 మార్చి త్రైమాసికంలో రూ. 2,812 కోట్లు సాధించింది. నికర NPAలు 1.7%గా ఉన్నాయి, QoQలో 2.14% నుంచి మెరుగుపడ్డాయి.


బ్యాంక్ ఆఫ్ ఇండియా: బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం Q4FY23లో రూ. 1,350 కోట్లకు 123% YoY వృద్ధి చెందింది, Q4FY22లోని రూ. 606 కోట్ల నుంచి పెరిగింది. నిర్వహణ లాభం సంవత్సరానికి 69.67% పెరిగింది. ఇది, Q4FY22లో రూ. 2,466 కోట్ల నుంచి Q4FY23లో రూ. 4,184 కోట్లకు చేరుకుంది.