Top Headlines Today:


పోలవరం టూర్ 
నేడు పోలవరం సందర్శించనున్న సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత తాడేపల్లి తిరిగి పయనమవుతారు. 


ఏం చెబుతారో?
నేడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు రానున్న టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు దిశగా వెళ్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుది. 


కీలక భేటీ 
మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ భేటీకి బీజేపీ ముఖ్యనేతలతోపాటు ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ బన్సల్‌ హాజరవుతారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. 


బెయిల్‌పై వాదనలు
వైఎస్ వివేక హత్య కేసులో నేడు మరో కీలకపరిణామం. వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇవాళ భాస్కర్‌రెడ్డి తరఫున వాదనలను కోర్టు వినబోతోంది. 


పారిశ్రామిక ప్రగతి ఉత్సవం 
తెలంగాణ దశాబ్ధి వేడుకల్లో భాగంగా  నేడు పారిశ్రామిక ప్రగతి ఉత్సవం చేపట్టనుంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సమావేశాలు ఏర్పాటుచేయనున్నారు. పారిశ్రామిక ప్రగతి వివరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 


కేసీఆర్ టూర్
నేడు నాగర్‌కర్నూల్‌లో సీఎం కేసీర్ పర్యటించనున్నారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించనున్నారు.  రూ.60కోట్లతో కలెక్టరేట్‌, రూ.35కోట్లతో పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ నిర్మించారు. 


కేటీఆర్‌ షెడ్యూల్
నేడు చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురంలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభించనున్నారు. ఈ పార్కులోని 51 పరిశ్రమలను, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, కామన్‌ ఫెసిలిటీ, సేవజ్‌ ట్రిట్‌మెంట్‌ ప్లాంటు, ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ కార్యాలయం(ఐలా), తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టీఫ్‌) తదితర కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు.


ఎన్టీఆర్ జిల్లాలో కేంద్రమంత్రి టూర్
ఎన్టీఆర్ జిల్లాలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటించనున్నారు. పీహెచ్‌సీలను పరిశీలించనున్నారు. ప్రధాన మాతృ వందన యోజన లబ్ధిదారులతో సమావేశం కానున్నారు. 


9 ఏళ్ల కార్యక్రమాలపై సమీక్ష 
బండి సంజయ్ అధ్యక్షత బీజేపీ తెలంగామ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన కార్యక్రమాలపై చర్చిస్తారు. కార్యక్రమాల  కమిటీతో సమీక్ష చేయనున్నారు సునీల్ బన్సల్. 


సింధుకు టఫ్‌ 
నేటి నుంచి సింగపూర్ ఓపెన్  బ్యాడ్మింటన్ పోటీలు. తొలిరౌండ్‌లో టాప్‌సీడ్‌ యమగూచితో తలపడనున్న సింధు.


నేడు ఆదిపురుష్‌ సినిమా ప్రీ రిలీజ్ వేడుక


శ్రీరామునిగా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఆ వేడుక కోసం సోమవారం సాయంత్రమే ప్రభాస్ తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమలలో దర్శనం చేసుకున్నారు. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి వస్తున్నారు. ఆయన ఓ సినిమా వేడుకకు వస్తుండటం ఇదే ప్రథమం. లక్ష మందికిపైగా భక్తులు, ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు వస్తారని ఓ అంచనా. వేదిక దగ్గర ప్రభాస్ 50 అడుగుల హోలో గ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. తిరుపతిలో అయోధ్య భారీ సెట్ వేశారు. సుమారు వంద మంది గాయనీ గాయకులు, డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారు. సంగీత దర్శకులు అజయ్, అతుల్ ఈ కార్యక్రమం కోసం ముంబై నుంచి తిరుపతికి బైక్ మీద వచ్చారు.