భద్రాచలంలో తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. మొదట భద్రాచలం సీతారామస్వామి దర్శించుకుంటారు. తర్వాత ఓ హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత గిరిజన అభ్యుదయ భవన్‌కు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడుతారు.  


నేడు విశాఖలో జగన్ పర్యటన
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నేడు విశాఖకు రాబోతున్నందును ముఖ్యమంత్రి జగన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించ నున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. 


సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది


మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఈ అంశంపై తీర్పు వెలువడనుంది. శివసేన గుర్తుపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, షిండే వర్గాల మధ్య ఎప్పటి నుంచే వివాదం నడుస్తోంది. దీనిపై ఇవాళ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. తొమ్మిది రోజుల పాటు అన్ని వైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.