నేడు ఢిల్లీకి సీఎం జగన్


సీఎం జగన్ (CM Jagan) గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. శుక్రవారం ప్రధాని మోదీతో (PM Modi) భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయనతో సీఎం చర్చించనున్నారు. కాగా, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన తన పర్యటన ముగించుకుని తిరుగు పయనమయ్యారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో ప్రధానితో సీఎం భేటీ ప్రాధాన్యతను సంతరించుకోనుంది. ఇంకా చదవండి


కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు


కోడికత్తి కేసులో (Kodikathi Case) నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ (Srinivas)కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు (AP HighCourt) గురువారం అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితునికి స్పష్టం చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతీ ఆదివారం ముమ్మిడివరం పీఎస్ లో హాజరు కావాలని ఆదేశించింది. ఇంకా చదవండి


త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు


తెలంగాణ ప్రజలు వారి ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిజమైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం గల పరిపాలనను ఎన్నుకున్నారని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్.. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని అన్నారు. ఒకప్పుడు ప్రజాభవన్‌కు అనుమతి లేని ప్రజలకు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేలా సిద్ధం చేశామన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించినట్లు గుర్తు చేశారు. ఇంకా చదవండి


నాడు హైదరాబాద్‌- నేడు సైబరాబాద్‌


తెలంగాణ గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై టీజర్‌ లాంటి అప్‌డేట్స్ ఇచ్చారు. భవిష్యత్‌లో చేపట్టబోయే పనులను తన ప్రసంగంలో తమిళిసై వివరణ ఇచ్చారు. అలాంటి వాటిలో ముఖ్యమైంది ఏఐ సిటీ. ఇంకా చదవండి


కృష్ణా జిల్లాలో జనసేనకు కేటాయించే సీట్లపై ఉత్కంఠ


ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ - జనసేన మధ్య సీట్ల పంచాయితీ తేలటం లేదు. ఇప్పటి వరకు జనసేనకు ఎన్ని సీట్లను కేటాయిస్తారనే అంశంపై తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో జనసేన పార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో మాత్రం సీట్ల కేటాయింపుపై ఇప్పటికే ప్రచారం హొరెత్తుతోంది. 23 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నాలుగు స్థానాలు డిమాండ్ చేస్తుంటే...తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది.. ఏ ఏ సీట్లు ఇస్తుందన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇంకా చదవండి