Weather Report: తెలుగు రాష్ట్రాల్లో వైవిధ్యమైన వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఉక్కపోత ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. మార్చి నెలను తలపించేలా ఉన్న వాతావరణం చికాకు పెడుతోంది. ఇదేమి వేడిరా బాబూ అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. వర్షాకాలం వచ్చింది ఏసీలు, ఫ్యాన్‌లతో పనేంటి అనుకున్న వాళ్లంతా ఇప్పుడు వాటి దుమ్ము దులుపుతున్నారు. ఆ రెండు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణం సాయంత్రానికి కాస్త ఊరట ఇస్తోంది. సాయంత్రం గానీ రాత్రివేళల్లో కానీ ఉరుములతో వర్షం కురుస్తుంది. అది కూడా కాసేపు మాత్రమే ఉంటోంది. తర్వాత మళ్లీ యథావిధిగా ఉక్కపోత మొదలైపోతోంది.
తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన వెదర్ రిపోర్ట్ పరిశీలిస్తే మరికొన్ని రోజులపాటు ఇలాంటి వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇలా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కాస్త వర్షాలు ఎక్కువగా పడాతాయని చెబుతోంది.
తెలంగాణలో వాతావరణం(Today Weather In Telangana )
వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ పరిశీలిస్తే... తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి. ఎలాంటి హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు.
హైదరాబాద్‌లో వాతావరణం(Today Weather In Hyderabad)
హైదరాబాద్‌లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో గరిష్ణ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు ఉంటే కనిష్ణ ఉష్ణోగ్రత 23 డిగ్రీలు రిజిస్టర్ అయ్యే అవకాశంఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం(Today Weather In Andhra Pradesh)
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి హెచ్చరికలు లేవు. దాదాపు అన్నిప్రాంతాల్లో ఏదో టైంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అమరావతిలో ఉన్న వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుందని వివరించింది.
Also Read: గ్లోబల్‌గా చమురు రేట్ల మంట - మీ నగరంలో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి