Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సోషల్ మీడియా పోస్టు సునామీ తీసుకు వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖకు ఓ కార్యక్రమంలో నూలు పోగులతో చేసిన దండ వేసిన ఫోటోను తీసుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఒక్కరు జుగుప్సాకరమైన కామెంట్‌తో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టును చూసి మంత్రి కొండా సురేఖ కంట తడి పెట్టుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. ఆ పోస్టు అభ్యంతరకరంగా హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇక పరిస్థితి సద్దుమణుగుతుందని అనుకునేంతలో కేటీఆర్ చిట్ చాట్‌లో రాహల్ గాంధీ, కొండా సురేఖపై చేసిన కామెంట్స్‌తో మొత్తం వ్యవహారం చేయిదాటిపోయింది.
మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు
బుధవారం ఉదయం మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో కేటీఆర్ కాస్త ఘాటుగా మాట్లాడారు. మూసి కూల్చివేతలతో పేదలు చస్తూంటే.. రాహుల్ గాంధీ ఎక్కడ సచ్చాడని కూడా ప్రశ్నించారు. కొండా సురేఖ ఏడుపులు, పెడబొబ్బలు అన్నీ డ్రామాలేనని అన్నారు. అవి కెమెరాల ముందు చేసిన వ్యాఖ్యలు కావు. కానీ మీడియా ప్రతినిధులు యాజిటీజ్ గా రిపోర్టు చేశారు. ఫలితంగా కొండా సురేఖ మరో అడుగు ముందుకేశారు.
మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున, అసలేం జరిగిందంటే!
వ్యక్తిగత విమర్శలు తారస్థాయికి !
కొండా సురేఖ కేటీఆర్ ను టార్గెట్ చేయడానికి నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. వారి పేర్లు ప్రస్తావించకపోతే రాజకీయ విమర్శలుగానే ఉండేవి. కానీ ఆ కుటుంబాలకు రాజకీయాలతో సంబంధం లేదు అయినా వారి విషయాన్ని తీసుకు రావడంతో వివాదం అయింది. కొండా సురేఖపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగార్జున ఆ విమర్శలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇక బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కొండా సురేఖ ఫోన్ కాల్ ఆడియో లీక్
కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ ఆడియోను లీక్ చేసింది. వేరొక మహిళతో కొండా సరేఖ మాట్లాడుతున్న ప్రైవేటు సంభాషణ అది. అందులో అసభ్యకరమైన మాటలు ఉన్నాయి. లకానీ అది రాజకీయం కాదు. ఆయినా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ క్రిషాంక్ దాన్ని ఆన్ లైన్ లో పెట్టారు. ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చింది.. ట్యాపింగ్ చేసినప్పుడు రికార్డింగ్ చేసిందా అని కాంగ్రెస్న నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కొండా సురేఖకు అండగా నిలుస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే మొదట ప్రారంభించారని అంటున్నారు.
ఏపీ తరహా రాజకీయాలు !
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇలాంటి అసభ్యకరమైన బూతు రాజకీయాలు చాలా ఎక్కువగా ఉండేవి. వైసీపీ తరపున తెర ముందుకు వచ్చే పేర్ని నాని, కొడాలి నాని, రోజా , పోసాని ఇలా ప్రతి ఒక్కరూ తమదైన భాషతో ఐదేళ్ల పాటు దడదడలాడించారు. వారికి కౌంటర్ ఇవ్వాడనికి టీడీపీ నేతలు అదే్ పని చేశారు. కుటుంబాలని కూడా సోషల్ మీడియాకు ఎక్కించుకుని ఆరోపణలు చేసుకున్నారు. అందరూ అందరి కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టుకున్నారు. ఇదే రాజకీయం అనుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఏపీలో మార్పు వచ్చింది. ఇప్పుడు అక్కడ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి కానీ బూతులు మాట్లాడటం లేదు. వైసీపీ అధికారంలో లేకపోవడంతో తమ అధికార భాషను వాడే ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ నేతలు గీత దాటడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి మారిపోయింది. ఏపీ రాజకీయాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి.