TSPSC ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై (Tamilisai) ఆమోదించారు. స్క్రీనింగ్ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించినా చివరకు మహేందర్ రెడ్డినే టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. కాగా, కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఛైర్మన్ పదవి కోసం 50 మంది సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఎ.శాంతికుమారి (Shanthi kumari), న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి (Tirupathi), సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మల(Nirmala)తో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకు ఫైల్ పంపారు. ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో టీఎస్ పీఎస్సీ నూతన ఛైర్మన్ గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది. ఇంకా చదవండి


వంద కోట్లు కాదు నాలుగైదు రెట్లు ఎక్కువే


హైదరాబాద్‌(Hyderabad)లో అక్రమాలతో ఎదిగిన అధికారి సంపాదన వెలుగులోకి వస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగైదు వందల కోట్లు ఆస్తులు వెనకేసుకున్నట్టు అవినీతి నిరోధక శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. 30 గంటలకు జరుపుతున్న సోదాలు, విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే సంపద వెలుగు చూస్తోంది. ఇంకా చదవండి


సీట్ల స‌ర్దుబాటుపై తేల్చని చంద్రబాబు


ఏపీ(AP)లో రాజ‌కీయాలు వేడెక్కాయి. మ‌రో రెండు మాసాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల(Elections)కు సంబంధించి అధికార‌, ప్ర‌తిప‌క్ష‌ పార్టీలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార పార్టీ వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌తో వేగంగా దూసుకుపోతుండ‌గా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఇంకా ఈ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టిన‌ట్టు క‌నిపించ‌డంలేదు. వైసీపీ మిన‌హా ఇత‌ర పార్టీల ప‌రిస్థితి ఎలా ఉన్నా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీని గ‌ద్దెదింపాల‌న్న ల‌క్ష్యంతో చేతులు క‌లిపిన తెలుగు దేశం పార్టీ(TDP), జ‌న‌సేన(Janasena) పార్టీలు అభ్య‌ర్థు ల ఎంపిక ప్ర‌క్రియ జోలికి పూర్తిస్థాయిలో వెళ్ల‌లేదు. దీంతో ఈ రెండు పార్టీను టార్గెట్ చేస్తూ వెల్లువెత్తుతున్న‌ న‌కిలీ వార్త‌లు(Fake News), ఊహాగానాలు సోష‌ల్ మీడియాలో సెగ‌పుట్టిస్తున్నాయి. ఇంకా చదవండి


జగన్‌ ఓ నియంత- సీఎం అయ్యాక మారిపోయిన మీరు వైఎస్‌ వారసులెలా అవుతారు? 


ఇది రైతు రాజ్యం కాదు.. వైఎస్సార్ సుపరిపాలన అంతకన్నా కాదని తేల్చి చెప్పారు షర్మిల. ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్‌లు ఇవ్వరు, 30 వేల టీచర్ ఉద్యోగ పోస్ట్‌లు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ లేదని కామెంట్ చేశారు. కాకినాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి


వైఎస్‌ ఫ్యామిలీని చీల్చింది జగనే- దేవుడు, తల్లే సాక్ష్యం- షర్మిల సంచలన కామెంట్స్


కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ చీఫ్‌ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని చీల్చింది అని జగన్ అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. YSR కుటుంబం చీలింది అంటే చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి వైఎస్సార్ భార్య విజయమ్మ అని వివరించారు. యావత్‌ కుటుంబం దీనికి సాక్ష్యంగా ఉన్నరని తెలిపారు. ఇంకా చదవండి