ఎన్నికల బరిలో నిలిచింది వీరే - ఫైనల్ లిస్ట్


తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు నిలిచినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్ లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొంది. ఇక, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) బరిలో నిలిచిన గజ్వేల్ (Gazwel Constituency) నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇంకా చదవండి


'రైస్ మిల్లుల్లో తనిఖీలు చేస్తే నాకేం సంబంధం' - ఐటీ సోదాలపై నల్లమోతు భాస్కరరావు


మిర్యాలగూడలో ఐటీ సోదాలపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు (Nallamothu Bhaskararao) స్పందించారు. వేములపల్లిలో (Vemulapally) ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తన ఇళ్లపై ఎలాంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనను ఎదుర్కోలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్స్ జరిగితే తనకేం సంబంధం ఉందని ప్రశ్నించారు. తన బంధువులు, కుమారుల ఇళ్లల్లోనూ సోదాలు జరగట్లేదని పేర్కొన్నారు. తనపై ఐటీ సోదాలు (IT Raids) జరిగితే తానెందుకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని నిలదీశారు. ఇంకా చదవండి


తెలంగాణ ఎన్నికల్లో సెంటర్ పాయింట్‌గా టీడీపీ


తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. పోటీ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ చంద్రబాబునాయుడు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి తెలంగాణలో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. బలమైన బీసీ వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడ్ని  చేశారు. ఖమ్మం, సికింద్రాబాద్ లో భారీ బహిరంగసభలు నిర్వహించారు. ఇక పోటీనే మిగిలింది అనుకుంటున్న సమయంలో చంద్రబాబును స్కిల్ ప్రాజెక్ట్ కేసులో నిందితుడు అంటూ అరెస్టు చేయడం ఆయన బయటకు రావడానికి దాదాపుగా రెండు నెలల సమయం పట్టడంతో మొత్తం సీన్ మారిపోయింది. పోటీ నుంచి విరమించుకునే నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చదవండి


'యాదాద్రి' ప్రారంభంలో జాప్యం 


రాష్ట్రంలో యాదాద్రి విద్యుదుత్పత్రి కేంద్రం (వైటీపీపీ) ప్రారంభంలో జాప్యం నెలకొంది. వచ్చే డిసెంబర్ లోగా విద్యుదుత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర జెన్ కో సన్నాహాలు చేసుకోగా కేంద్రం నిబంధనతో ఆ సమయంలోగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పర్యావరణ అనుమతి (ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ - ఈసీ) మంజూరు కోసం 2024, జనవరి 31లోగా నివేదిక పంపాలని కేంద్ర పర్యావరణ శాఖ తాజాగా టీఓఆర్ (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) జారీ చేసింది. దీంతో డిసెంబర్ లోపు విద్యుదుత్పత్రి సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఎందుకంటే జనవరి 31లోగా నివేదిక పంపితే ఫిబ్రవరి లేదా మార్చిలో కేంద్ర పర్యావరణ శాఖ ఈసీని జారీ చేసే అవకాశముంటుంది. ఈసీ వచ్చిన తర్వాతే ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభం సాధ్యమవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా చదవండి


నాదెండ్ల మనోహర్‌ కాదు, కట్టప్ప మనోహర్‌- నాదెండ్లపై మంత్రి అమర్నాథ్‌ సెటైర్లు


రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు మంత్రి గుడివాడ  అమర్నాథ్ (Minister Gudivada Amarnath)‌. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జనసేన నేత నాదెండ్ల  మనోహర్‌(Nadendla Manohar)ను కట్టప్పతో పోల్చారు మంత్రి అమర్నాథ్‌. కట్టప్ప మనోహర్‌ (Kattappa Manohar) అంటూ కామెంట్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక సంస్థకు  ఊరికే భూములు ఇచ్చేస్తోందని చెప్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నాదెండ్ల మనోహర్‌ కట్టప్ప వేశాలకు పవన్‌ కళ్యాణ్‌ పడతారేమో గానీ... రాష్ట్ర ప్రజలు  పడరని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ చదవి ప్రభుత్వంపై బుదరచల్లితే.. ప్రజలు నమ్మేస్తారని అనుకోవడం ఆయన అమాయకత్వమని అన్నారు. ఇంకా చదవండి