నారా లోకేశ్ కు భారీ ఊరట
స్కిల్ స్కాం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో లోకేశ్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయరని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో హైకోర్టు లోకేశ్ పై స్కిల్ కేసును క్లోజ్ చేసింది. స్కిల్ స్కాం కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీఐడీని ఆదేశించాలంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ ను లోకేశ్ హైకోర్టులో దాఖలు చేశారు. ఇంకా చదవండి
కేసీఆర్‌తో హరీష్, కేటీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ సమావేశమైనట్టు సమాచారం. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాతోపాటు ఎన్నికల మేనిఫెస్టో అంశంపై చర్చించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రచార వ్యూహాలపై మాట్లాడుకున్నారని వినికిడి. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి బీఆర్‌ఎస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారిని నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసింది. ఐదు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నేపథ్యంలో వీటి ప్రకటన ఆలస్యమవుతోంది. షెడ్యూల్ వచ్చిన వేళ ఆ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇంకా చదవండి
గేటెడ్ కమ్యూనిటీ లలో పోలింగ్ కేంద్రాలు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పాటుకు సన్నాహాలు
తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాయి. ఓటర్లను వలలో వేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయ్. మరోవైపు అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించిన యంత్రాంగం వారు తమ ఓటు హక్కు ను ఖచ్చితంగా వినియోగించుకొనేలా చూడటానికి కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపధ్యంలో హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికను రూపొందించే ప్రయత్నం చేశారు ఎన్నికల అధికారులు. గేటెడ్ కమ్యూనిటీలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తమ సంసిద్ధత ప్రకటించారు. ఇంకా చదవండి
హైదరాబాద్‌లో వింత, చనిపోయిన 20 వేల మందికి ఓటు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివిధ నియోజకర్గాల్లో దాదాపు 20,000 మంది చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సీనియర్ అధికారులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఇలాంటి పేర్లను దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన, ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చదవండి
హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడిని ఆదేశిస్తూ విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అరెస్టు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మొదట ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ తిరస్కరణకు గురి కావడంతో ఆయన హైకోర్టు మెట్లు ఎక్కారు. ఇంకా చదవండి