దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేటు సెంచరీ దాటేసింది. కేంద్రం ఎక్సైజ్ పన్నులు, రాష్ట్రాల వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లతో పెట్రోలు ధర వందకు దిగనంటోంది. ఈ తరుణంలో తమిళనాడు ప్రభుత్వం వాహనదారుడి జేబు గుళ్లకాకుండా పెట్రోల్ రేటు తగ్గించింది. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తోన్న పన్నును రూ. 3 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  పెట్రోల్ ధర రూ.వంద మార్క్‌ను దాటి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. తమిళనాడు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.


Also Read: IND vs ENG 2nd Test Score Live: స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు... కేఎల్ రాహుల్ (129), రహానె(1) ఔట్


 


డీజిల్ పై తగ్గింపు లేదు


పెట్రోల్ ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు ఉంటాయి. దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ విధిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పోటుతో పెట్రోలు రేటు సెంచరీ కొట్టేసింది. ధర తగ్గించడానికి ముందు తమిళనాడు రాజధాని చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో పెట్రోలు ధర వంద దిగువకు వస్తుంది. ఏప్రిల్‌లో కొలువుదీరిన స్టాలిన్‌ ప్రభుత్వం శుక్రవారం మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో పెట్రోల్ ధర తగ్గింపు నిర్ణయాన్ని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. డీజిల్‌పై మాత్రం తగ్గింపు ప్రకటించలేదు. 


Also Read: Rahul Gandhi Twitter: మై బీ హూ రాహుల్ గాంధీ.. ట్విట్టర్లో ఫోటోలు మార్చేస్తుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు


ఏటా రూ.1160 కోట్లు భారం


స్టాలిన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏటా ₹ 1,160 కోట్ల మేర ఖజానాపై భారం పడనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.102.49, డీజిల్‌ ధర రూ.94.39 ఉంది. ఆగస్టు 14 నుంచి తగ్గింపు ధరలు అమల్లోకి రానున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీలు కొడుతున్న ఈ తరుణంలో తమిళనాడు తీసుకున్న ఈ నిర్ణయంతో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పన్నులు తగ్గించేలా ఈ నిర్ణయం ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 19 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర వంద దాటేసింది. పెట్రోల్‌పై పన్ను తగ్గించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా తమిళనాడు ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మాతృత్వ సెలవులను 9 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్‌ వంటి పథకాలకు మధ్యంతర బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. 


 


Also Read: Ysrcp Mla Roja: ఆమె రూటే సెపరేటు.. ఫైర్ బ్రాండ్ ఈ మధ్య ఎందుకో సైలెంట్!