కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ.. తన ట్విట్టర్ అకౌంట్  ప్రొఫైల్ పీక్  మార్చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ఫోటోను పెట్టుకున్నారు. ఆమెతోపాటు చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ ట్విట్టర్ అకౌంట్ ఫొటోలను మార్చారు. రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను.. ఆ సంస్థ.. లాక్ చేయడంతో నిరసనగా ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ఖాతాలకు లాక్ వేయడానికి ట్విట్టర్ తన సొంత పాలసీలను పాటించిందా లేదంటే మోదీ ప్రభుత్వ పాలసీలను పాటించిందా? అని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.


మరోవైపు రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను లాక్‌ చేసినట్లు ట్విటర్‌ దిల్లీ హైకోర్టుకు తెలిపింది. దిల్లీలోని దళిత బాలిక హత్యాచారం కేసులో బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటి ప్రపంచానికి తెలిసేలా ట్వీట్‌ చేసిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ట్విటర్‌ ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడించింది. తమ పాలసీకి వ్యతిరేకంగా ఉండడంతో ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు ఆయన ట్విటర్‌ ఖాతాను సైతం లాక్‌ చేసినట్లు ట్విటర్‌ పేర్కొంది. ట్విటర్‌ ఇండియాను ఇందులోకి పిటిషనర్‌ అవవసరంగా  లాగారని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్‌ 27కు వాయిదా వేసింది.


అత్యాచారం కేసుల్లో బాధితుల వివరాలు బయటకు తెలిసేలా వ్యవహరించకూడదు. అయితే, దిల్లీలోని బాలిక హత్యాచారం కేసులో బాధితుల కుటుంబ సభ్యుల వివరాలను బయటి ప్రపంచానికి తెలిసేలా రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారంటూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో రాహుల్‌పై చర్యలకు జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆదేశించాలని, రాహుల్‌పై కేసులు నమోదు చేయాలని ఓ సామాజిక కార్యకర్త పిటిషన్‌ దాఖలు చేశారు. జువైనల్‌, పోక్సో చట్టాలను రాహుల్‌ ఉల్లంఘించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.








 


అసలు ఏం జరిగిందంటే..


పోక్సో చట్టాన్ని అతిక్రమించి అత్యాచారానికి గురైన బాధితురాలి ఫ్యామిలీ వివరాలు చెప్పినందుకు ట్విట్టర్‌కు నోటీసులు ఇచ్చింది ఎస్‌సీపీసీఆర్. రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో బాధితురాలి ఫ్యామిలీని ఓదారుస్తున్నట్టు పెట్టిన ఫొటో పెట్టారు. వివాదానికి దారి తీసిన రాహుల్‌ గాంధీ ట్వీట్‌ను ట్విట్టర్ డిలీట్ చేసింది. 


పోక్సో చట్టం రూల్స్ ప్రకారం రేప్ బాధితుల వివరాలు గోప్యంగా ఉంచాలి. ఈ రూల్‌ను అతిక్రమించారని... రాహుల్ గాంధీ, ట్విట్టర్‌పై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్‌కు ఫిర్యాదు అందింది. బాధితుల వివరాలు బహిర్గతం చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుదారు. 


ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్... ట్విట్టర్‌ తరఫున ఇండియాలో ఉండే గ్రీవెన్స్‌ ఆఫీసర్‌కు లెటర్ రాసింది. రేప్‌ విక్టిమ్‌ ఫ్యామిలీ ఫొటో ట్విట్టర్‌లో పోస్టు చేయడం చాలా బాధాకరమని... ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షార్హమని సూచించింది. పోక్సో చట్టంలోని 23సెక్షన్, జువైనల్ యాక్ట్ 2015లోని 74 సెక్షన్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించింది. 
ఈ లెటర్‌పై ట్విట్టర్‌ రియాక్ట్ అయింది. రాహుల్ గాంధీ పోస్టు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేసింది. అనంతరం.. ఆగష్టు 6 నుంచి తాత్కాలికంగా రాహుల్ ట్విట్టర్ అకౌంట్ ను లాక్ చేసినట్టు తెలిపింది. 


 


Also Read:PM Modi: స్క్రాపేజ్ పాలసీ వచ్చేసింది.. ఇక అలాంటి వాహనాలు రోడ్డుపై కనిపిస్తే చలాన్ల మోతే...


              Vijaya Sai Reddy Bail: విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నిర్ణయం కోర్టుదే.. కోర్టులో సీబీఐ మెమో దాఖలు