Ysrcp Mla Roja: ఆమె రూటే సెపరేటు.. ఫైర్ బ్రాండ్ ఈ మధ్య ఎందుకో సైలెంట్!

Continues below advertisement

ప్రతిపక్ష నేతలను తన మాటలతో ఇరకాటంలో పెట్టే నగరి ఎమ్మెల్యే రోజా ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా విమర్శలకు దూరంగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో అధికంగా పాల్గొంటూ ప్రజల దృష్టిలో పడుతున్నారు. తాజాగా పుత్తూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న షిరిడీ సాయిబాబా నిత్య అన్నదాన సాంఘిక సేవా సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. షిరిడి సాయి వృద్ధాశ్రమం, షిరిడిసాయి అనాథ బాలల విద్యాశ్రమం, షిరిడి సాయి కళ్యాణ మండపం నిర్మాణల కోసం నాందిగా తలపెట్టిన వరసిద్ధి వినాయక మందిర నిర్మాణానికి ఇవాళ రోజా దంపతులు భూమి పూజ చేశారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు  ఎమ్మెల్యే ఆర్.కె.రోజా, సెల్వమణి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram