IND vs ENG 2nd Test Score Live: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3 ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్

భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.

ABP Desam Last Updated: 13 Aug 2021 11:03 PM

Background

భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 276/3 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే భారత్ 500 పరుగుల మార్కును దాటడం ఖాయం. England Playing XI: Rory...More

ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 276/3తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 126.1 ఓవర్లలో 364 పరుగులకి ఆలౌటైంది. జేమ్స్ అండర్సన్‌కి 5 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి  119  పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా  245 పరుగుల వెనుకంజలో ఉంది.