ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకును లండన్‌కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ మ్యాగజీప్‌ బుధవారం ప్రకటించింది. ఈ యూనివర్సిటీ ర్యాంకుల్లో రికార్డు స్థాయిలో ఈసారి భారత్‌కు చెందిన 91 యూనివర్సిటీలకు చోటు దక్కింది. గత ఏడాది 75 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించాయి. బెంగళూరులోని ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (IISc)కు భారత్‌లోని ఉత్తమ వర్సిటీగా మరోసారి నిలిచింది. ఈ వర్సిటీకి ఈ ర్యాంకుల్లో 250వ ర్యాంకు దక్కింది. 2017 తర్వాత మరోసారి ఈ ర్యాంకు లభించింది. 108 దేశాల్లోని 1904 విశ్వవిద్యాలయాలు ఈసారి ర్యాంకింగ్‌లో పాల్గొన్నాయి.


ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి ఈ ర్యాంకుల్లో మొదటి స్థానం లభించింది. తర్వాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. మన దేశంలోని అగ్రశ్రేణి ఐఐటీలు వరుసగా నాలుగో ఏడాది ఈ ర్యాంకులను బహిష్కరించాయి. గత ఏడాది ఈ ర్యాంకుల్లో భారత్‌ ఆరోస్థానంలో ఉండగా.. ఈ సారి 91 విశ్వవిద్యాలయాలకు చోటు దక్కడంతో భారత్‌ స్థానం నాలుగుకు మెరుగుపడింది. భారత్‌లోని అన్నా విశ్వవిద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు, స్కూలిని యూనివర్సిటీ ఆఫ్‌ బయోటెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌.. ఈ నాలుగు విశ్వవిద్యాలయాలకు 501 నుంచి 600 ర్యాంకుల మధ్య నిలిచాయి. గువహటి, ధన్‌బాద్‌ ఐఐటీలు గతసారి 1001 నుంచి 1200 ర్యాంకుల శ్రేణి జాబితాలో ఉండగా, ఈసారి 601 నుంచి 800 శ్రేణి జాబితాలోకి చేరుకుని మెరుగయ్యాయి. కోయంబత్తూర్‌లోని భారతీయార్‌ విశ్వవిద్యాలయం, జైపూర్‌లోని మాలవీయ ఎన్‌ఐటీ కూడా ఈ జాబితాలోకి వచ్చాయి. 


ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో చోటు సాధించిన భారతీయ వర్సిటీల జాబితా..


-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు


- అన్నా యూనివర్సిటీ


-జామియా మిలియా ఇస్లామియా


-మహాత్మా గాంధీ యూనివర్సిటీ


-శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్
-అళగప్ప యూనివర్సిటీ


-అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ


- బనారస్ హిందూ యూనివర్సిటీ


-భారతీయార్ యూనివర్సిటీ


-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి


-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) ధన్‌బాద్


-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పాట్నా


-ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్


-జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ


-జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ


-కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, భువనేశ్వర్


-మాల్వియా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ


-మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్


-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా


-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిల్చార్


-పంజాబ్ యూనివర్సిటీ


-సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్


-థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ


-వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ


-అమిటీ యూనివర్సిటీ


-అమృత విశ్వ విద్యాపీఠం


-బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ


-ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ


- ఢిల్లీ యూనివర్సిటీ


-ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ


-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పూణే


-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్


-ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ


-జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్‌టీయూఏ)


-జేపీ యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ


- JSS అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
కలశలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్


-లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ


-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి


-యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్


-సావిత్రీబాయి ఫూలే పూణే యూనివర్సిటీ


-శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ


-శిక్ష 'ఓ' అనుసంధన్